PM Modi | సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నేడు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తలైవాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం రజనీకాంత్‌కు పుట్టినరోజు (Rajinikanth Birthday)శుభాకాంక్షలు తెలిపారు.
‘75వ పుట్టినరోజు సందర్భంగా తిరు రజనీకాంత్జీకి శుభాకాంక్షలు. ఆయన నటన ఎన్నోతరాలుగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. తన స్టైల్‌తో ఎన్నో ప్రశంసలు పొందారు. విభిన్న పాత్రలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 75వ పుట్టినరోజు చేసుకుంటోన్న సంవత్సరంలోనే ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తికావడం విశేషం. ఆయన ఇలానే మంచి ఆరోగ్యంగా ఉంటూ ప్రేక్షకులను అలరించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Also Read..
Crypto Mogul: క్రిప్టో మొఘల్ డూ క్వాన్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
UK Museum | బ్రిటన్ మ్యూజియంలో భారీ దొంగతనం.. విలువైన భారతీయ కళాఖండాలు మాయం
Shivraj Patil | కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత