న్యూయార్క్ : క్రిప్టోకరెన్సీ టైకూన్(Crypto Mogul) డూ క్వాన్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. అమెరికా కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. డూ క్వాన్ కంపెనీ అవకతవకలకు పాల్పడింది. దీని వల్ల సుమారు 40 బిలియన్ల డాలర్ల క్రిప్టో పెట్టుబడులు ఆవిరైపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మార్కెట్ పతమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. క్వాన్ రెండు రకాల డిజిటల్ కరెన్సీలను నడిపారు. న్యూయార్క్ కోర్టు అతనికి శిక్ష వేసింది. ఆగస్టులో జరిగిన విచారణ సమయంలో అతను తప్పు చేసినట్లు అతను అంగీకరించాడు. డూ క్వాన్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఆసియా, యూరోప్ దేశాల్లో అన్వేషించారు.
క్రిప్టోకు చెందిన టెర్రా కంపెనీని స్థాపించాడతను. శిక్షలో భాగంగా తొలుత అమెరికాలో ఆ తర్వాత దక్షిణకొరియాలో సగం శిక్షను అనుభవించనున్నారు. 40 బిలియన్ల డాలర్ల ఫ్రాడ్ వల్ల.. 2022లో స్టాక్ మార్కెట్లో ఎఫ్‌టీఎక్స్ కుప్పకూలింది. ఆ తర్వాత 2023లో క్రిప్టో పరిశ్రమపై అమెరికా తీవ్ర స్థాయిలో రెగ్యులేటరీ అమలు చేసింది. లూనా కంపెనీ సుమారు 325 డాలర్లతో 2021 జనవరిలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏప్రిల్ 2022 వరకు ఆ కంపెనీ 41 బిలియన్ల డాలర్లు ఆర్జించింది. ఆ తర్వాత ఆ ఏడాది మే నెలలో జీరో స్థాయికి చేరుకున్నది.