ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా(Khaleda Zia) ఆరోగ్యం క్షీణిస్తున్నది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. శ్వాస కోస సమస్యలు పెరిగాయని, ఆమె ఆక్సిజన్ స్థాయి పడిపోయిందని, కార్బన్ డయాక్సైడ్ లెవల్స్ పెరిగినట్లు డాక్టర్లు ఓ ప్రకటనలో తెలిపారు. కార్డియాలజిస్ట్ షాహబుద్దిన్ తాలుక్దార్ ఖలిదా ఆరోగ్యంపై స్టేట్మెంట్ విడుదల చేశారు. ఊపిరితిత్తులతో పాటు ఇతర ముఖ్య అవయవాలకు రెస్ట్ ఇచ్చే నేపథ్యంలో వెంటిలేటర్‌పై పెట్టినట్లు డాక్టర్లు చెప్పారు. ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ చైర్మపర్సన్ చికిత్స పొందుతున్నరు.
నవంబర్ 23వ తేదీ నుంచి ఆమె చికిత్స కొనసాగుతున్నది. స్థానిక,విదేశీ స్పెషలిస్టుల సమక్షంలో ఆమెకు చికిత్స జరుగుతున్నది. కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదని, ప్రస్తుతం ఆమెకు రెగ్యులర్‌గా డయాలసిస్ చేస్తున్నట్లు మెడికల్ బోర్డు చెప్పింది.ఆమెకు తక్షణమే రక్తమార్పిడి జరగాలని డాక్టర్లను అడిగింది.