Amazon Mega Electronics Days Sale 2025 | ల్యాప్టాప్స్, ట్యాబ్‌లు, స్మార్ట్ వాచ్‌ల వంటి గ్యాడ్జెట్స్‌ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే అమెజాన్ ఓ నూతన సేల్‌ను ప్రారంభించింది. మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ పేరిట శుక్రవారం ఓ సేల్‌ను ప్రారంభించారు. ఈ సేల్ ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతుందని అమెజాన్ తెలియజేసింది. ఇందులో భాగంగా పలు కంపెనీలకు చెందిన అనేక రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలను, అనేక ఆఫర్లను అందిస్తున్నారు. ఈ సేల్‌లో హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్‌లు తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. డెల్, సోనీ, శాంసంగ్ వంటి కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్‌పై ఆఫర్లను అందిస్తున్నారు. బెస్ట్ సెల్లింగ్ గ్యాడ్జెట్లపై ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేల్‌లో హెచ్‌పీ 15 ఏఎండీ ప్రాసెసర్ ల్యాప్ టాప్‌ను రూ.30వేల ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఏసర్ ఏస్పయిర్ లైట్ థిన్, లైట్ ప్రీమియం ట్యాప్ టాప్‌లను రూ.34వేల ప్రారంభ ధరకు ఈ సేల్‌లో పొందవచ్చు. డెల్ ఇన్స్పిరాన్ 3535 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్‌ను రూ.42,990 ధరకు అందిస్తున్నారు. అలాగే లెనోవో థిన్‌బుక్ 16ను రూ.49,990కి, హెచ్‌పీ 15 ఇంటెల్ ల్యాప్ టాప్‌ను రూ.52,490కి, హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 ఓలెడ్ ల్యాప్ టాప్‌ను రూ.61,990కి, అసుస్ టఫ్ గేమింగ్ ఎ15 ను రూ.70,990కి, ఏసర్ నైట్రో వి15 గేమింగ్ ల్యాప్ టాప్‌ను రూ.72,990కి, డెల్ జి సిరీస్ 15 5530 ల్యాప్ టాప్‌ను రూ.75,990 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. వీటిపై పలు బ్యాంక్ ఆఫర్లను సైతం అందిస్తున్నారు. దీంతో ల్యాప్ టాప్ల ధర మరింత తగ్గుతుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం పొందవచ్చు.
ఇక ఈ సేల్‌లో పలు కంపెనీలకు చెందిన హెడ్ ఫోన్స్‌ను సైతం తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. అమెజాన్ బేసిక్స్, నాయిస్ బడ్స్, బౌల్ట్ ఎక్స్ మస్తాంగ్, జేబీఎల్, స్కల్ క్యాండీ, మార్షల్, బోస్, సోనీ వంటి కంపెనీలకు చెందిన హెడ్ ఫోన్స్‌ను తగ్గింపు ధరకుల పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ ప్యాడ్ లైట్ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను రూ.13,999కే పొందవచ్చు. అలాగే లెనోవో ఐడియా ట్యాబ్ స్మార్ట్ చాయిస్ ధర రూ.21,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ11 ప్లస్ ట్యాబ్‌ను రూ.21,499కు, గెలాక్సీ ట్యాబ్ ఎస్10 లైట్ ట్యాబ్‌ను రూ.29,002 ధరకు పొందవచ్చు.
రెడ్మీ వాచ్ 5 లైట్, నాయిస్ దివా 2 ఫ్యాషన్, నాయిస్ ఆరిజిన్, అమేజ్‌ఫిట్ యాక్టివ్ 2 స్క్వేర్, వన్ ప్లస్ వాచ్ 2ఆర్, వన్ ప్లస్ వాచ్ 2, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ వంటి వాచ్‌లపై కూడా డిస్కౌంట్ ధరలను అందిస్తున్నారు. అలాగే డిజిటెక్, సీపీ ప్లస్, గో ప్రో, సోనీ వంటి కంపెనీలకు చెందిన కెమెరాలను కూడా తగ్గింపు ధరలకు ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఈఎంఐ వాడితే ప్రొడక్ట్స్‌పై రూ.4500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.3250, హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ.3750, వన్ కార్డ్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.3500 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ పేజీని సందర్శించవచ్చు.