RS Praveen kumar | తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీ లకు చెరో 8 ఎంపీ స్థానాలు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులపై దాడులు చేస్తున్నారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ హరీష్ రావు ప్రైవేటు ప్రాపర్టీపై దాడి చేయడానికి వెళ్లారు. కాంగ్రెస్ వాళ్లు చెప్పి మరీ వెళ్తుంటే డీజీపీ ఏం చేస్తున్నారు. ఎంపీలు చేయాల్సిన పని ఇదేనా…? అని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అరికెపూడి గాంధీ అనే ఎమ్మెల్యే పోలీసుల సహాయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని చంపడానికి వెళ్లారు. పోలీసు బందోబస్తుతో హరీశ్ రావు పొలాలకు కాంగ్రెస్ వాళ్లను పంపించారు. సీఎం ప్రైవేటు ఆస్తుల వద్దకు వెళ్తే ఊరుకుంటారా..? ప్రజలు మిమ్మల్ని అధికార పీఠం మీద కూర్చోబెట్టింది ఇందుకేనా..? తెలంగాణలో భూ దందా నడుస్తోంది . తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భూ దందాలకు పాల్పడుతున్నారన్నారు.
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పార్లమెంట్ నియోజకవర్గం గద్వాలలో కులాంతర వివాహం చేసుకున్నందుకు దళిత కుటుంబంపై దాడి జరిగింది. ట్రాన్స్ జెండర్లకు, కాంగ్రెస్ వాళ్లు చేసే దానికి తేడా లేదు. ట్రాన్స్ జెండర్లు కనీసం పోలీసులు చెప్పింది పాటిస్తున్నారు. ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోంది. ఒక్కో ఎంపీకి 8 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి సంవత్సరం రూ.5 కోట్లు ఎంపీ ల్యాడ్స్ కింద నిధులు ఇస్తుంది. ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమంలో మల్లు రవి,చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ వున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు.
రేవంత్ రెడ్డికి పాలన చేతకాదని ప్రజలకు అర్థమైంది.. అందుకే వాళ్లే వెళ్లి నీళ్లు వదులుకున్నారు
రైతులే వెళ్లి జూరాల ప్రాజెక్టు తాళాలు పగలగొట్టి నీళ్లు వదులుకున్నారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పనితనం ఎలా ఉందో తెలుస్తుంది
ఇందుకోసమేనా మల్లు రవి ఎంపీ అయింది?
మల్లు రవి సిగ్గు లేకుండా… https://t.co/9SKjJvRBq5 pic.twitter.com/YlxOuI7nHq
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2026
ATMs | కరీంనగర్లో ఏటీఎంలలో దొంగలు హల్చల్ : వీడియో
Nabha Natesh | సైమా వేడుకల్లో మెరూన్ గౌన్లో మెరిసిన నభా నటేష్.. ఫొటోలు వైరల్!
Watch: ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె కుటుంబం కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే..?