HIV Cases | బీహార్‌లో హెచ్ఐవీ కలకలం.. ఒక్క జిల్లాలోనే 7,400 మందికి పాజిటివ్.. 400 మంది చిన్నారులే
HIV Cases | బీహార్ (Bihar) రాష్ట్రంలో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు (HIV Cases) ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క సీతామర్హి (Sitamarhi) జిల్లాలోనే ఏకంగా 7,400 మందికిపైగా హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది.
HIV Cases | బీహార్ (Bihar) రాష్ట్రంలో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు (HIV Cases) ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క సీతామర్హి (Sitamarhi) జిల్లాలోనే ఏకంగా 7,400 మందికిపైగా హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. వారిలో 400 మందికిపైగా చిన్నారులే (Children Affected) ఉండటం గమనార్హం. జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి.
400 మందికిపైగా పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి వైరస్ సంక్రమించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని వైద్య అధికారులు తెలిపారు. తల్లిదండ్రుల్లో ఎవరికి హెచ్ఐవీ ఉన్నా, పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ పరిస్థితిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ హసీన్ అక్తర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి నెలా సగటున 50 నుంచి 60 కొత్త హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గుర్తించిన బాధితుల్లో దాదాపు 5,000 మంది రోగులకు వైద్య చికిత్స, మందులు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హెచ్ఐవీపై ప్రజల్లో అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా ఆయన పేర్కొన్నారు.
Also Read..
IndiGo | ఇండిగో సంక్షోభం.. నలుగురు అధికారులపై డీజీసీఏ వేటు
PM Modi | తలైవాకు ప్రధాని మోదీ స్పెషల్ బర్త్‌డే విషెస్
US Embassy | డెలివరీ కోసమా.. అయితే వీసాలివ్వం : యూఎస్ ఎంబసీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

