US Embassy | అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వలసలపై కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వీసాల జారీ విషయంలోనూ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కొందరు అమెరికా పౌరసత్వం పొందేందుకు టూరిస్ట్ వీసాతో డెలివరీ కోసం (birth tourism plans)అమెరికా వెళ్తుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి అమెరికా తాజాగా కీలక ప్రకటన చేసింది. బిడ్డకు జన్మనివ్వడం కోసం టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే దాన్ని తిరస్కరిస్తామని (No visa)స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. ‘అమెరికాలో జన్మనిచ్చి పౌరసత్వం పొందేందుకు కొందరు పర్యాటకులు ప్రయత్నిస్తున్నారు. జన్మనిచ్చే ఉద్దేశంతోనే అమెరికాకు ప్రయాణిస్తున్నట్లు తెలిస్తే అలాంటి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తాం. ఇటువంటి వాటిని అనుమతించం’ అని ఎక్స్ ట్వీట్లో పేర్కొంది.
Also Read..
Shivraj Patil | కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
భారత్‌పై మరో దేశం 50 శాతం సుంకాలు.. ట్రంప్ కళ్లలో ఆనందం కోసమే?
సుప్రీంకోర్టులో 90,900 కేసులు పెండింగ్