IndiGo | దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో సంక్షోభం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగానే నలుగురు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లపై (flight operations inspectors) వేటు వేసింది. అయితే, వీరి తొలగింపు వెనుక ఎలాంటి కారణాన్ని డీజీసీఏ పేర్కొనలేదు. డీజీసీఏ ఆగ్రహానికి గురైన ఆ నలుగురు విమానయాన భద్రత, కార్యాచరణను పర్యవేక్షిస్తుంటారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే వీరిని తొలగించినట్లు తెలుస్తోంది.
కాగా, గత పది రోజులకు పైగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇండిగోలో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ప్రతి రోజూ వందలాది విమానాలు రద్దు, ఆలస్యమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. ఈ సంక్షోభం నేపథ్యంలో రంగంలోకి దిగిన డీజీసీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ సంక్షోభానికి పర్యవేక్షణలో లోపాలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో విమానాల భద్రత, కార్యాచరణను పర్యవేక్షించే నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది.
Also Read..
PM Modi | తలైవాకు ప్రధాని మోదీ స్పెషల్ బర్త్డే విషెస్
US Embassy | డెలివరీ కోసమా.. అయితే వీసాలివ్వం : యూఎస్ ఎంబసీ
UK Museum | బ్రిటన్ మ్యూజియంలో భారీ దొంగతనం.. విలువైన భారతీయ కళాఖండాలు మాయం