హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఓ చిన్నారిపై ట్యూషన్ టీచర్ (Tuition Teacher) దాష్టీకానికి పాల్పడింది. విచక్షణ మరచిన టీచర్ చిన్నారిపై 8 చోట్ల అట్లకాడతో వాతలు పెట్టింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
షేక్‌పేటలోని ఓయూ కాలనీకి చెందిన ఏడేండ్ల బాలుడు తేజ నందన్ ఒకటో తరగతి చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న మానస అనే టీచర్ వద్దకు అతని తల్లిదండ్రులు ట్యూషన్‌కు పంపుతున్నారు. రోజూలానే గురువారం సాయంత్రం కూడా ట్యూషన్‌కు వెళ్లాడు. అయితే సరిగ్గా చదవడం లేదనే కారణంతో కాళ్లు, చేతులు, ముఖంపై అట్లకాడతో కాల్చింది. దీంతో బాలుడి శరీరంపై 8 చోట్ల కాలిన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ట్యూషన్ టీచర్‌పై ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా దవాఖానకు పంపించారు. గాయాల వల్ల తేజ నందన్నడవలేకపోతున్నాడు. తమ కొడుకును విచక్షణారహితంగా అట్లకాలతో కాల్చిన మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.