ఢిల్లీ అన్‌లాక్.. 50శాతం సీటింగ్ కెపాసిటీతో మెట్రో సర్వీసులు
ఢిల్లీ అన్‌లాక్.. 50శాతం సీటింగ్ కెపాసిటీతో మెట్రో సర్వీసులు | దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపులు ప్రకటించింది.

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపులు ప్రకటించింది. మూడు వారాల తర్వాత ఢిల్లీలో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి. 50శాతం సీటింగ్ సామర్థ్యంతో మెట్రో నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా లాక్‌డౌన్‌తో మే 20 నుంచి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పూర్తిస్థాయిలో సేవలను నిలిపివేసింది. అందుబాటులో ఉన్న రైళ్లలో సగం మాత్రమే నడుస్తాయని డీఎంఆర్సీ అధికారి తెలిపారు. మరో వైపు మాల్స్, మార్కెట్లు, దుకాణాలు సరి-బేసి విధానంలో తెరువనుండగా.. సినిమా థియేటర్లు, రెటస్టారెంట్లు, బార్లు, జిమ్‌లు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ ఫార్లర్లు మూసే ఉండనున్నాయి.
ప్రైవేటు కార్యాలయాలు సైతం 50శాతం సిబ్బందితో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్ ఏ సిబ్బంది వంద శాతం సామర్థ్యంతో, గ్రూప్-బీలో 50శాతం మంది సిబ్బందితో పని చేయనున్నాయి. ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మే 31న అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే.రోజు రోజుకు కేసులు తగ్గుముఖం పడుతుండడంతో గత శనివారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం నుంచి మరిన్ని సడలింపులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
కెనడాలో వింత వ్యాధి
డెల్టా పెరిగింది.. కప్పా తగ్గింది!
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
Krishnapatnam : నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

