అందుబాటులోకి మరిన్ని రైళ్లు
అందుబాటులోకి మరిన్ని రైళ్లు | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున రైళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో రైల్వేశాఖ ఇప్పటికే పలుమార్గాల్లో ప్యాసింజర్తో పాటు ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించింది.

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున రైళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో రైల్వేశాఖ ఇప్పటికే పలుమార్గాల్లో ప్యాసింజర్తో పాటు ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించింది. తాజాగా మరోసారి పలు రూట్లలో పెద్ద ఎత్తున రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందులో గరీబ్ రథ్ స్పెషల్ తాజ్ ఎక్స్ప్రెస్, షాన్-ఎ-పంజాబ్, ముంబై సెంట్రల్-హజ్రత్ నిజాముద్దీన్ ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్ప్రెస్తో సహా 50కిపైగా రైళ్లను తిరిగి ప్రారంభిస్తోంది. ప్రజలకు ప్రయాణం మళ్లీ చౌకగా, సురక్షితంగా, సౌకర్యంగా ఉంటుందని రైల్వేశాఖ మంత్రి పీయూల్ గోయల్ అన్నారు.
ముంబై సెంట్రల్ నిజాముద్దీన్ ఆగస్ట్ క్రాంతి రాజధాని స్పెషల్ శనివారం నుంచి నడుస్తుండగా.. షాజహాన్పూర్-సీతాపూర్ సిటీ, సీతాపూర్ సిటీ- షాజహాన్పూర్ రిజర్వుడ్ ఎక్స్ప్రెస్ స్పెషల్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. లక్నో-వారణాసి ఇంటర్సిటీ స్పెషల్ (04270), వారణాసి-లక్నో ఇంటర్సిటీ స్పెషల్ (04269) సోమవారం నుంచి పట్టాలెక్కనున్నాయి. వారణాసి – ఆనంద్ విహార్ (04249) ఈ నెల 8 నుంచి, ఆనంద్ విహార్ – వారణాసి (04250), గరీబ్ రథ్ స్పెషల్ రైళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. మరో గరీబ్ రథ్ స్పెషల్ ఆనంద్ విహార్ – ముజఫర్పూర్ ట్రైన్ 7 నుంచి నడువనుంది. ఈ నెల 5 నుంచి న్యూఢిల్లీ – ఝాన్సీ తాజ్ఎక్స్ప్రెస్ స్పెషల్ (04062), ఝాన్సీ – న్యూఢిల్లీ తాజ్ఎక్స్ప్రెస్ స్పెషల్ పట్టాలెక్కనుంది.

ఇవి కూడా చదవండి..
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
ఉత్తరాఖండ్ సీఎం ఎవరో ? నేడు శాసనసభాపక్షం సమావేశం
ముంబైలో రూ.300కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద ప్రవాహం
కొవాగ్జిన్ టీకా సామర్థ్యం 77.8శాతం.. ట్రయల్స్ తుది డేటా ప్రకటించిన భారత్ బయోటెక్
దేశంలో 97.06శాతానికి కరోనా రికవరీ రేటు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

