ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 21 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంకి చెందిన ఏఐఎస్ఎఫ్ ఖమ్మం రూరల్ మండలం కార్యదర్శి బూర్రా మనోజ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ మేరకు నిజామాబాద్ పట్టణంలో ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా నియమితులయ్యాడు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు.