యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ప్రస్తుత కరోనా కాలంలో ఎందరో సెలవిస్తున్నారు. అయితే, యోగ చేయడం అనేది గురువు లేకుండా సాధ్యపడదు. ఒక పద్ధతి ప్రకారం యోగా సాధన చేయడం ద్వారా శరీరాన్ని అదుపులో ఉంచుకోవచ్చని సెలవిస్తున్నారు యోగా నిపుణులు. అయితే, ఆఫ్రికాలోని ఓ యువకుడికి ఇలాంటి శిక్షణలేవీ లేకుండానే శరీరాన్ని 360 డిగ్రీల్లో వంచేస్తూ శహబాష్ అనిపించుకుంటున్నాడు.
ఈ యువకుడు చేసే స్టంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఇంతవరకు మనం చేయని, చూడని ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఈ వీడియో షేర్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ ఆశ్చర్యపోయారు. ఈ వ్యక్తిని ఆఫ్రికాకు చెందిన బాబా రామ్‌దేవ్ అని పేరు పెట్టారు. ఒకటిన్నర నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఆ యువకుడు చేసే పలు స్టంట్లు చూడవచ్చు. పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే వేలాది మంది వీక్షించగా.. వందల మంది షేర్ చేశారు. ఇది ముమ్మాటికి మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుందనడంలో ఎలాంటి ఔచిత్యం లేదు.
#BabaRamdev of #Africa
— Rupin Sharma (@rupin1992) April 26, 2021
No #YogaMudras but just mudra and flexibility pic.twitter.com/n30bO7TgQl
యాంటీ-క్యాన్సర్ ఔషధమైన విన్కోవ్ -19 కు డీసీజీఐ ఆమోదం
సబ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చరిత్రలో ఈరోజు
వెరీ సింపుల్ మ్యారేజీకి వీరే ఉదాహరణ..!
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్‌లోని ఓ ఊరి కథ
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..