ఖమ్మం రూరల్ : భూ వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఉదాంతం ఖమ్మం రూరల్ మండలం గూడూరు పాడు గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… గూడూరు పాడు గ్రామానికి చెందిన బండి రామయ్య(52) అనే వ్యక్తి గత కొద్ది కాలం వరకు గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనాధారం గడుపుతున్నాడు. ఇటీవల తన సొంత వ్యవసాయ భూమిని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ గ్రానైట్ వ్యాపారికి అమ్మాడు.
అయితే భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి గత కొద్ది నెలలుగా క్వారీకి వెళ్లే దారి వెడల్పు మరింత కావాలని రామయ్యని అడుగుతున్నట్లు సమాచారం. ఈ సమయంలో ఇద్దరి మధ్యలో తరచుగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో రామయ్య క్వారీ యజమాని, నిర్వాహకులు పెడుతున్న ఇబ్బందిని ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని గురువారం తెల్లవారుజామున క్వారీ దగ్గరికి వెళ్లిన రామయ్య క్వారీలో ఉన్న భారీ వాహనానికి ఉరివేసుకొని చనిపోయినట్లు తెలుస్తోంది.
అయితే రామయ్య మరణానికి గల కారణం భూవివాదాలేనా మరి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. రామయ్య మరణ వార్త తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చరీకి తరలించారు. గూడూరుపాడు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది