భూటాన్‌లో యాంటీ స్మార్ట్ సిటీ.. చెట్ల కంటే భవనాలు ఎత్తుగా ఉండొద్దని ఆదేశం
భూటాన్ యాంటీ స్మార్ట్ సిటీ ఇప్పుడు ప్రపంచంలోని పలువురు పర్యాటకులను ఆకర్షిస్తున్నది. సాధారణంగా స్మార్ట్ సిటీ అంటే ఆకాశహర్మ్యాలు, ఆధునిక సౌకర్యాలతో అలరారుతుంది. గెలెపు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ అని పేరు పెట్టిన ఈ నగరం దానికి విరుద్ధం.
థింపూ: భూటాన్ యాంటీ స్మార్ట్ సిటీ ఇప్పుడు ప్రపంచంలోని పలువురు పర్యాటకులను ఆకర్షిస్తున్నది. సాధారణంగా స్మార్ట్ సిటీ అంటే ఆకాశహర్మ్యాలు, ఆధునిక సౌకర్యాలతో అలరారుతుంది. గెలెపు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ అని పేరు పెట్టిన ఈ నగరం దానికి విరుద్ధం. ఇక్కడ ఆకాశాన్నంటే భవనాలు కాదు.. కనీసం అక్కడ ఉన్న చెట్లకన్నా ఎత్తయిన భవనాలు కూడా కన్పించవు. ఏ భవనం కూడా అక్కడ ఉన్న చెట్లను మించి ఎత్తు ఉండరాదని ప్రభుత్వం నిబంధన విధించింది. దీనిని ప్రపంచంలోనే తొలి యాంటీ స్మార్ట్ సిటీగా అభివర్ణిస్తున్నారు.
భారత్‌లోని అస్సాం సరిహద్దుకు సమీపంలోనే ఈ నగరం ఉంది. భారతీయులు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించకుండా 24 గంటల పాటు ఈ నగరాన్ని ఉచితంగా సందర్శించవచ్చు. చుట్టుపక్కలున్న అడవులు తగ్గిపోకుండా నగరాన్ని రూపొందిస్తున్నారు. ఇక్కడ ప్రకృతికి, పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి వ్యాపారాలు ఇక్కడ నిర్వహించరు. కేవలం పర్యావరణ హిత వ్యాపారాలు మాత్రమే ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

