అపర భగీరథుడు కేసీఆర్.. పాలమూరు నీటి గోస తీర్చారు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తీవ్ర కరువు, వలసల వేదనను అనుభవించిన పాలమూరు గడ్డను సస్యశ్యామలం చేసి, అకడి ప్రజల దశాబ్దాల నీటి గోసను తీర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తీవ్ర కరువు, వలసల వేదనను అనుభవించిన పాలమూరు గడ్డను సస్యశ్యామలం చేసి, అకడి ప్రజల దశాబ్దాల నీటి గోసను తీర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద భారీ మోటర్లను ప్రారంభించి విజయవంతంగా మూడేండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏండ్ల తరబడి మూలనపడ్డ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన అపర భగీరథుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన కొనియాడారు.ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని సుమారు 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు పుషలంగా సాగునీరు అందించడంతో పాటు 1,226 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని సమకూర్చాలనే బృహత్తర సంకల్పంతో కేసీఆర్ ప్రణాళికలు రచించారని కేటీఆర్ గుర్తుచేశారు.
కేసీఆర్‌పై కోపంతోనే పాలమూరు ప్రాజెక్టు పడావు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షలను ప్రాజెక్టులపై చూపించవద్దని, కేసీఆర్‌పై ఉన్న కోపంతో పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టవద్దని కేటీఆర్ సూచించారు. నార్లాపూర్ పంపులు ప్రారంభించి మూడేండ్లు పూర్తయిన ఈ తరుణంలోనైనా ప్రభుత్వం కండ్లు తెరిచి, పెండింగ్‌లో ఉన్న మిగిలిన పనులను త్వరితగతిన పూర్తిచేసి రైతుల చివరి ఆయకట్టు వరకు నీటిని పారించాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధితో నిధులు విడుదల చేసి పనులను ముందుకు నడపాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

