కోల్‌కత, సెప్టెంబర్ 22 : జీఎస్టీ తగ్గింపు వల్ల ఆర్థిక నష్టాన్ని రాష్ర్టాలపై పడేసి తాను మాత్రం పన్నులు తగ్గించిన ఘనతను కేంద్రం కొట్టేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కోల్‌కతాలో సోమవారం దుర్గా పూజను ప్రారంభించిన అనంతరం మమత మాట్లాడుతూ ప్రజలపై అదనపు జీఎస్టీ భారాన్ని తగ్గించాలని కోరింది ముందుగా తానేనని చెప్పారు.
పతి రాష్ట్రం ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు మార్గాలు వెతుక్కోవలసి ఉంటుందని మమత చెప్పారు. కొత్త జీఎస్టీ రేట్ల వల్ల పశ్చిమ బెంగాల్‌కు సుమారు 20,000 కోట్ల రెవెన్యూ నష్టం ఏర్పడగలదని ఆమె అంచనా వేశారు.