నంగునూరు/ సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 22: “కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం, రైతుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఆయిల్‌పామ్ సాగవుతుంది. కేసీఆర్ చేపట్టిన పాలమూరు, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల ఫలితంగా తెలంగాణలో ఆయిల్‌పామ్ పంట సాగుకు అనుకూలంగా మారింది” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆయిల్పామ్సాగు లాభసాటి పంట.. రైతులందరూ సాగుచేయాలని కోరారు. ఆయిల్‌పామ్ రైతులకు ఆశాకిరణమని, వేలాది మంది రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చి దశ దిశను మార్చే ఫ్యాక్టరీ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ట్రయిల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు ఫ్యాక్టరీని సందర్శించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ..2004లో నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే నంగునూరు నర్మెట్ట నుంచి ఒక ఫోన్ వచ్చింది. నా పక పొలమోడు బోరేస్తున్నడు. ఆబోరు వేయకుండా ఆపండి అని ఫోన్ వచ్చింది. ఈ ప్రాంతం కరువు ప్రాంతంగా ఉండేది. నంగునూరును కూడా కరువు మండలంగా ప్రకటించారు. ఎకడైతే కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తారో అకడ తహసీల్దార్ అనుమతి తీసుకొని బోరు వేయాలి. ఎవరైనా బోరు వేస్తే కలెక్టర్‌కు చెప్పి బోరు బండిని ఆపించిన రోజులు ఉండేవి. ఈ రోజు తెలంగాణ, సిద్దిపేట, నంగునూరులో బోరు బండ్లు మాయమైపోయాయి.
కోతుల బాధ లేదు. చీడ పట్టే బాధ లేదు. ఒకసారి సాగుచేస్తే 30 ఏండ్ల వరకు నెలనెలా జీతం పడ్డట్టు ఆదాయం వస్తుంది. చిన్నకోడూరు మండలంలో కంప్యూటర్ సైన్స్ చదివిన వ్యక్తి నెలకు రూ. 60 వేల ఐటీ ఉద్యోగం వదిలి ఆయిల్‌పామ్ సాగుచేశాడు. మంచి ఆదాయం ఉంది అని సంతోషం వ్యక్తం చేశాడు. ఐఐవోఆర్, ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ వారు చెప్పితే తప్పా ఇకడ ఆయిల్‌పామ్ సాగు చేయలేమని నాకు చెప్పారు. సిద్దిపేటకు పామాయిల్ పంట తీసుకొద్దాం అని ప్రయత్నం చేసిన తొలినాళ్లలో.. 2018లో ఇకడ ఆయిల్‌పామ్ సాగు ఉండదు అని చెప్పి వెళ్లిపోయారు. గాలిలో తేమశాతం తకువ ఉంది ఇకడ ఆయిల్‌పామ్ సాగు జరగదు అని తేల్చి చెప్పారు.
ఆ తర్వాత 2019లో అన్నపూర్ణ (అనంతగిరి), రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌తో పాటు చెరువులు, చెక్డ్యాముల్లో నీళ్లు నింపుకున్నాం. 2021లో పరిశోధన చేసిన తర్వాత మళ్లీ గాలిలో తేమశాతం పెరిగింది. ఇకడ ఆయిల్‌పామ్ సాగు చేసుకోవచ్చు అని ప్రకటించారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్‌సాగు అవుతున్నది. రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చిందంటే కారణం కాళేశ్వరం.. బోరు బండ్లు మాయమైనాయి అంటే కారణం కాళేశ్వరం.. వరి పండుతుంది కానీ ఎకరానికి రూ. 30 వేల కంటే ఎకువ మిగలదు.. కానీ ఆయిల్పామ్సాగు లాభసాటిగా ప్రతినెలా జీతం పడ్డట్టు రైతుకు ఆదాయం వస్తుంది.
2022లో జూన్ 5న నంగునూరు మండలంలోని రామచంద్రాపూర్‌లో మడుగు ఎల్లారెడ్డి అనే రైతు పొలంలో మొదటి ఆయిల్‌పామ్ మొక నాటాను. ఒకొక రైతును గుర్తించి ఒకొక ఎకరం పెట్టించి ఈ రోజు ఇకడి వరకు వచ్చాను. అందుకే ఏదో భావోద్వేగం.. అందుకే ఇది మా కల.. చుట్టుపకల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ వరప్రదాయిని కాబోతున్నది. విత్తనం నాటింది బీఆర్ఎస్… కానీ పండ్లు తినడానికి మాత్రం బయలుదేరింది కాంగ్రెస్ వాళ్లు..ఈ ఫ్యాక్టరీ రావడానికి వెనుక కష్టం ఎవరిది? తంట ఎవరిది? చెమట చుకలు చిందించింది ఎవరు అనేది ప్రజలకు తెలుసు.. 2022 ఏప్రిల్‌లో ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చేతుల మీద శంకుస్థాపన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఆయిల్‌పామ్‌కు పుట్టినిల్లు మలేషియా. అకడ టెక్నాలజీ బాగుందని ఇకడికి తీసుకువచ్చి ఇకడ పెట్టామన్నారు. కానీ ఈ ఫ్యాక్టరీలో 100 టన్నుల గెలలకు 20 టన్నుల పామాయిల్ వస్తుంది. ఈ లాభాలు రైతుకే వస్తాయి. వరి, మకలో 60 నుంచి 70 వేల కంటే లాభం లేదు. ఇకముందు కోకో పంట వైపు అడుగులు వేద్దాం. ఫ్యాక్టరీ ప్రారంభమై నిన్ననే ట్రయల్ కూడా ప్రారంభించారు. ఈ సంతోషంలో పాల్గొన్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని హరీశ్‌రావు అన్నారు.
కొన్ని ఫ్యాక్టరీల వల్ల కొంతమందికే లాభం జరుగుతుంది కానీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వల్ల ప్రతి రైతుకు లాభం జరుగుతుంది. గతంలో శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో తేమశాతం తకువ ఉండటం వల్ల ఆయిల్‌పామ్‌కు అనుకూలంగా ఉండదన్నారు. కేసీఆర్, హరీశ్‌రావుల పుణ్యమా అని రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్లనే ఆయిల్‌పామ్‌కు అనువైన ప్రాంతంగా తయారైంది. యూరియా కోసం మళ్లీ చెప్పులు క్యూలో వస్తాయని కలలో కూడా అనుకోలేదు. చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌రెడ్డి హయాంలో చెప్పుల క్యూ ఉండేవి మళ్లీ ఇప్పుడు ఉంటున్నయి. నాడు హరీశ్‌రావు ఒత్తిడి వల్ల 25 ఎకరాలు ఆయిల్పామ్సాగు చేశాం. ఇప్పుడు మళ్లీ 25 ఎకరాలు పెట్టాలనుకుంటున్నాం.
ఉద్యమాల గడ్డ సిద్దిపేటలో ఫ్యాక్టరీ రావడం సంతోషకరం. ఇంత మంచి ఫ్యాక్టరీ తెచ్చిన కేసీఆర్, హరీశ్‌రావుకు ధన్యవాదాలు. వ్యవసాయాన్ని స్థిరీకరించి భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలో తీర్చిదిద్దారు. 2014లో 10 లక్షల టన్నుల పంట ఉంటే.. పదేండ్ల తర్వాత 50 లక్షల పంట వరకు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో వరి ఉత్పత్తిలో నెంబర్ వన్‌గా చేసింది కేసీఆర్. విస్తీర్ణం , ఉత్పత్తి, ఉత్పాదకతలోనూ తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అయ్యింది. మూడు కోట్ల టన్నులు పండించడంతో పాటు 2023లో 145 లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్‌సీఐకి అందించాం. చెరువులు బాగు చేసుకోవడం, ప్రాజెక్టులు కట్టడం, 24గంటల కరెంట్ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు రైతు బంధు 72 వేల కోట్లు అందించాం. ఎవరు వ్యవసాయాన్ని పెంపొందించారన్నది రైతుల వద్ద చర్చ పెట్టాలి.
– పల్లా రాజేశ్వరెడ్డి, జనగామ ఎమ్మెల్యే
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నవ శకానికి నాంది. కేసీఆర్ చేసిన చర్యల వల్ల ఈ ప్రాంత వాసుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ప్రజల మీద ప్రేమ ఉండటం వల్లే కాళేశ్వరం పూర్తయింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలి. ప్రాణంగా ప్రేమించిన సిద్దిపేటను ఒక విశ్వాసపాత్రుడికి అప్పగించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సిద్దిపేటను అభివృద్ధి చేశారు. ఓటమి ఎరుగని నాయకుడు హరీశ్‌రావు. దేశంలోనే ఉత్పత్తి ఎకువ అయ్యే ఫ్యాక్టరీ నర్మెట ఫ్యాక్టరీ. రైతులకు ఇది ఎంతో మేలు.
– దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ
భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా సిద్దిపేటను హరీశ్‌రావు తీర్చిదిద్దారు. యూరియా సరఫరా చేయలేని దౌర్భాగ్య సరారు కాంగ్రెస్. అన్ని సమకూర్చినా ప్రభు త్వం నడపలేకపోతున్నారు. కేసీఆర్ హయాంలో యూరియాను బఫర్ స్టాక్ ఉంచి రైతులకు ఇబ్బంది కాకుండా చూశారు.
– యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
భారతదేశంలోని నియోజకవర్గాల్లో సిద్దిపేట నియోజకవర్గం నెంబర్ వన్‌గా ఉంటుంది. దీని వెనుక హరీశ్‌రావు కృషి ఎంతో ఉంది. మన దేశం మలేషియా నుంచి ఒక లక్షా ఇరవై వేల కోట్ల విలువ గల ఆయిల్‌పామ్ దిగుమతి చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మరో మలేషియాగా మార్చాలని కోరుతున్న. ఆ లక్షా ఇరవై వేల కోట్లు తెలంగాణ రైతులకు వచ్చేలా చేయాలి.అది హరీశ్‌రావుకే సాధ్యం. ఇంకా ఆయిల్‌పామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పామాయిల్ సాగు
చేసే రైతులకు సబ్సిడీ అందించాలి.
– వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్
సిద్దిపేట, సెప్టెంబర్ 22: “నాడు కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాం… కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, అందుకే ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నరు” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నాగరాజుపల్లె గ్రామానికి కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ ఆహీగర్, ఇమామ్, హమీద్, జకిరెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో సాధించుకున్న తెలంగాణ… నేడు కాంగ్రెస్ హయాంలో సర్వరోగంగా తయారైందన్నారు. ప్రజల గుండెల్లో నిలిచేది గులాబీ జెండానే… కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని హరీశ్‌రావు అన్నారు.