This Week On OTT | ఈ వారం ఓటీటీ ప్రియులకు పండుగే అని చెప్పాలి. తెలుగులో భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఫంకీ, నవాబ్ కేఫ్ వంటి సినిమాలతో పాటు వివిధ భాషలకు చెందిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ సినిమాలు, సిరీస్‌లు ఏంటి అనేది చూసుకుంటే.!
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
మేడ్ ఇన్ కొరియా (Made In Korea): తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.
ఫంకీ (Funky): తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
పెన్నుమ్ పొరాట్టమ్ (Pennum Porattum): మలయాళంతో పాటు తెలుగు, తమిళ వెర్షన్లు అందుబాటులో ఉంది.
వన్ పీస్ సీజన్ 2 (One Piece S2): ప్రఖ్యాత సిరీస్ తెలుగు, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
గ్లాడియేటర్ 2 (Gladiator 2): యాక్షన్ ప్రియుల కోసం ఈ ఇంగ్లీష్ సినిమా అందుబాటులోకి వచ్చింది.
వర్జిన్ రివర్ సీజన్ 7 (Virgin River S7): ఇంగ్లీష్ మరియు హిందీ వెర్షన్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
దట్ నైట్ (That Night): ఈ స్పెయిన్ సిరీస్ తెలుగు, హిందీ భాషల్లోనూ చూడవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
లాక్డౌన్ (Lockdown): తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలయ్యింది.
కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly): తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.
ఆస్పిరెంట్స్ సీజన్ 3 (Aspirants S3): పాపులర్ హిందీ సిరీస్ ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
యోగిదా (Yogida): తమిళంతో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లలోనూ అందుబాటులో ఉంది.
స్కార్పెట్టా (Scarpetta): క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు, హిందీ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.
లోకల్ టైమ్స్ (Local Times): తమిళ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
జీ5 (Zee5)
భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi): తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
పూకీ (Pookie): తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.
అంధా ప్యార్ 2 (Andha Pyaar 2): హిందీ వెబ్ సిరీస్.
జియో హాట్‌స్టార్ (JioHotstar)
జూటోపియా 2 (Zootopia 2): ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
రిసార్ట్ (Resort): సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది.
ద మాడిసన్ (The Madison): ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
రూస్టర్ (Rooster): మరో ఆసక్తికరమైన సిరీస్ సిద్ధంగా ఉంది.
ఇతర ప్లాట్‌ఫామ్‌లు
ఈటీవీ విన్ (ETvWin): ‘నవాబ్ కేఫ్’ (Nawab Cafe) అనే తెలుగు సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
సన్ నెక్స్ట్ (Sunnxt): ఫ్రైడే (తమిళం), శుక్రన్ (మలయాళం) సినిమాలు అందుబాటులో ఉన్నాయి.
లయన్స్ గేట్ ప్లే (LionsGatePlay): ది తాజ్ స్టోరీ, టర్బ్యులెన్స్ వంటి సినిమాలు తెలుగులోనూ చూడవచ్చు.
టెంట్ కొట్టా (Tentkotta): కరుప్పు పల్సర్ (తమిళం).