న్యూఢిల్లీ : స్వదేశీ వస్తువులే కొనుగోలు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. స్వదేశీ వస్తువులే కొనాలని ప్రధాని మోదీ ప్రజలను అర్థించారని, కాని ఆయన ప్రయాణించే విదేశీ విమానం, ఉపయోగించే విదేశీ వస్తువుల మాటేమిటని సోమవారం ఎక్స్‌లో కేజ్రీవాల్ ప్రశ్నించారు.
ముందుగా స్వదేశీ వస్తువులను ఉపయోగించడం మీరే ఎందుకు మొదలుపెట్టరు? భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న నాలుగు అమెరికన్ కంపెనీలను ఎందుకు మూసివేయరు? అంటూ కేజ్రీవాల్ నిలదీశారు.