మల్కాజిగిరి : రైల్వే గేట్ల వద్ద ఆర్యూబీ ( RUB Works ) లను నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, హైదరాబాద్, సికింద్రాబాద్ డీఆర్ఎంలు సంతోష్‌కుమార్ వర్మ, గోపాలకృష్ణన్‌కు ఆర్‌యూబీలు, డ్రైనేజీ పనులు చేపట్టాలని వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేరేడ్మెట్, రజనప్రియ అపార్టుమెంట్ వద్ద ఆర్‌యూబీలు, బొల్లారం బజార్, కొత్త బస్తీ బజార్141 డివిజన్ భవానీనగర్,భూదేవినగర్, మౌలాలి శ్రీనగర్ కాలనీ నాలాల వద్ద డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడానికి అభివృద్ధిపనులను రైల్వే అధికారులు చేపట్టాలని కోరారు. రామకృష్ణాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, నాయకులు అనిల్‌కిశోర్, జీకే హన్మంతరావు, అమీనుద్దీన్, రాముయాదవ్, చిన్నయాదవ్, భాగ్యనందరావు, వంశీముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.