Lionel Messi | మెస్సీ మరో ఘనత.. ఆ ఒక్క గోల్‌తో అవార్డు కొల్లగొట్టాడు!
Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన లియోనల్ మెస్సీ(Lionel Messi) మరో ఘనత సాధించాడు. ఈ ఏడాది 'చాంపియన్స్ లీగ్ గోల్ ఆఫ్ ది సీజన్' (Champions League goal of the season award)అవార్డు సొంతం చేసుకున్నాడు. రియల్ మాడ్రిడ్ ఆటగాడు వినిసియస్ జూనియర్(Vinicius Jr), ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland)లను వెనక్కి నెట్టి...
Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన లియోనల్ మెస్సీ(Lionel Messi) మరో ఘనత సాధించాడు. ఈ ఏడాది ‘చాంపియన్స్ లీగ్ గోల్ ఆఫ్ ది సీజన్’ (Champions League goal of the season award)అవార్డు సొంతం చేసుకున్నాడు. రియల్ మాడ్రిడ్ ఆటగాడు వినిసియస్ జూనియర్(Vinicius Jr), ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland)లను వెనక్కి నెట్టి మరీ మెస్సీ ఈ అవార్డు దక్కించుకున్నాడు. పీఎస్జీ(PSG) క్లబ్ తరఫున ఆడిన సమయంలో బెన్ఫికా(Benfica) జట్టుపై చేసిన గోల్ అతడికి ఈ అవార్డు తెచ్చిపెట్టింది. ఆ మ్యాచ్‌లో మెస్సీ ఎడమ కాలితో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు.
మెస్సీ వచ్చే సీజన్లో కొత్త క్లబ్‌కు ఆడనున్నాడు. పీఎస్జీతో రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో అతను ఈమధ్యే అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు మారాడు. అతడిని దక్కించుకునేందుకు బార్సిలోనా(Barcelona), సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al Hilal) ప్రయత్నించాను.
The Goal of the Tournament results are in… 🥁
Congrats, Leo Messi! 👏#UCLGOTT | @Heineken pic.twitter.com/I4JDZF9xN1
— UEFA Champions League (@ChampionsLeague) June 30, 2023
ఇంటర్ మియామి క్లబ్ – మెస్సీ

కానీ, మెస్సీ మాత్రం వీటిని కాదని ఇంటర్ మియామికి ఓకే చెప్పాడు. మేజర్ సాకర్ లీగ్(Major Soccer League)లో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. అక్కడ అర్జెంటీనా, బార్సిలోనా మాజీ కోచ్ గెరార్డ్ టాటా మర్టినో దగ్గర తన ఆటను మరింత మెరుగుపరుచుకోనున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ నిరుడు అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ రేపిన ఫైనల్ పోరులో మెస్సీ జట్టు 4-2తో ఫ్రాన్స్‌ను చిత్తు చేసింది. కైలియన్ ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్‌తో భయపెట్టినా కూడా జట్టును గెలిపించలేకపోయాడు.
ఇవి కూడా చదవండి
Wimbledon 2023 | వింబుల్డన్ డ్రా.. ఈసారి టాప్ సీడ్లు చెమటోడ్చాల్సిందేనా..!
Ashes Series | స్టార్క్ దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

