SRH vs KKR | అర్ధశతకంతో పోరాడిన త్రిపాఠి.. కోల్‌కతా ముందు ఊరించే లక్ష్యం
SRH vs KKR : పదిహేడో సీజన్లో రికార్డు స్కోర్లతో ప్రత్యర్థులను భయపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) బ్యాటర్లు కీలక పోరులో చేతులెత్తేశారు. రాహుల్ త్రిపాఠి(55) అర్ధ సెంచరీతో కదం తొక్కగా చివర్లో కమిన్స్(30) మెరపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
SRH vs KKR : పదిహేడో సీజన్లో రికార్డు స్కోర్లతో ప్రత్యర్థులను భయపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) బ్యాటర్లు కీలక పోరులో చేతులెత్తేశారు. ఫైనల్ బెర్తును నిర్ణయించే క్వాలిఫయర్ 1లో ఘోరంగా విఫలమయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(3/34) విజృంభణతో హిట్టర్లంతా డగౌట్ చేరిన చోట.. రాహుల్ త్రిపాఠి(55) అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. హెన్రిచ్ క్లాసెన్(32)లతో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(30), అబ్దుల్ సమద్(16)ల మెరపులతో హైదరాబాద్ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. కోల్‌కతాకు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
టేబుల్ టాపర్‌తో పోరులో టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ తీసుకొని భారీ మూల్యమే చెల్లించాడు. 13 పరుగులకే ఓపెనర్లు డగౌట్‌కు చేరారు. తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్(0)ను సూపర్ యార్కర్‌తో మిచెల్ స్టార్క్ వెనక్కి పంపి సన్‌రైజర్స్‌కు షాకిచ్చాడు. రెండో ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ(3) సైతం డౌట్ చేరడంతో హైదరాబాద్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
అయితే.. రాహుల్ త్రిపాఠి(55) అద్భుతంగా పోరాడాడు. హెన్రిచ్ క్లాసెన్(32) అండగా 50 ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడడంతో హైదరాబాద్ స్కోర్ 170 దాటుతుందనిపిచింది. కానీ, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లాసెన్ బౌండరీ వద్ద చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన అబ్దుల్ సమద్(16) రెండు సిక్సర్లతో చెలరేగాడు. కానీ, నరైన్ ఓవర్లో సింగిల్ తీసే కమ్రంలో త్రిపాఠిని రనౌట్ చేశాడు.
Yes…No…and eventually run-out at the strikers end!
Momentum back with @KKRiders 😎#SRH 123/7 after 14 overs
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvSRH | #Qualifier1 | #TheFinalCall pic.twitter.com/I6SJLghAqc
— IndianPremierLeague (@IPL) May 21, 2024
కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఆ తర్వాత వచ్చిన ఇంప్యాక్ట్ ప్లేయర్ సన్వీర్ సింగ్(0) బౌల్డ్ కాగా.. ఆల్‌రౌండర్ షహ్బాజ్ అహ్మద్(0), భువనేశ్వర్(0) లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆదశలో కమిన్స్(30) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్క్ ఓవర్లో సిక్సర్, ఫోర్‌తో జట్టు స్కోర్ 150 దాటించాడు. రస్సెల్ వేసిన ఆఖరి ఓవర్లో కమిన్స్ .. కీపర్ చేతికి చిక్కడంతో హైదరాబాద్ 159 పరుగులకు ఆలౌటయ్యింది.
A 𝗳𝗶𝗴𝗵𝘁𝗶𝗻𝗴 knock under pressure! Chin up, Trips 🫡🫶#PlayWithFire #KKRvSRH pic.twitter.com/7y1mG7YB5G
— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

