Video | బైక్పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించాడు.. ఏమైందో తెలుసా..?
Video | ఒక్కోసారి మనం చిన్న నష్టాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించి పెద్ద నష్టాల బారిన పడాల్సి వస్తుంది. పర్సు కొట్టేసి పారిపోతున్న దొంగను వెంబడించి రోడ్డు ప్రమాదంలో గాయపడటం లాంటివి ఈ కోవకే చెందుతాయి. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన బ్రెజిల్లో జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఖరీదైన రోలెక్స్ వాచ్ను దొంగిలించి బైక్పై పారిపోతున్న దొంగను తన లంబోర్గిని కారుతో వెంబడించిన వ్యక్తికి వాచ్ ఖరీదుకు మించిన నష్టమే జరిగింది.
Watch : ఒక్కోసారి మనం చిన్న నష్టాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించి పెద్ద నష్టాల బారిన పడాల్సి వస్తుంది. పర్సు కొట్టేసి పారిపోతున్న దొంగను వెంబడించి రోడ్డు ప్రమాదంలో గాయపడటం లాంటివి ఈ కోవకే చెందుతాయి. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన బ్రెజిల్లో జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఖరీదైన రోలెక్స్ వాచ్ను దొంగిలించి బైక్పై పారిపోతున్న దొంగను తన లంబోర్గిని కారుతో వెంబడించిన వ్యక్తికి వాచ్ ఖరీదుకు మించిన నష్టమే జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్లోని సా పౌలో నగరానికి చెందిన ఓ వ్యక్తి తన లంబోర్గిని కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అదే సమయంలో బైక్పై వచ్చిన ఓ దొంగ.. లంబోర్గిని కారు పక్కనే ఆగాడు. గ్రీన్ సిగ్నల్ పడగానే లంబోర్గిని కారులోని వ్యక్తి నుంచి ఖరీదైన రోలెక్స్ వాచ్ను దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో కారులోని వ్యక్తి దొంగను వెంబడించి అతని బైకును ఢీకొట్టాడు.
స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది కూలిపోయింది. దాదాపు రూ.4 కోట్ల ఖరీదు పలికే కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. అయితే బైకుపై నుంచి కిందపడిన దొంగ.. తన బైకును, మొబైల్ ఫోన్ను ఘటనా ప్రాంతంలోనే వదిలేసి.. దొంగిలించిన వాచ్ను తీసుకుని పారిపోయాడు. పోలీసులు మొబైల్ ఫోన్ ఆధారంగా దొంగను అదుపులోకి తీసుకున్నారు.
దొంగిలించిన వాచ్ను రికవరీ చేసి లంబోర్గిని కారు వ్యక్తికి ఇచ్చారు. ఆ రోలెక్స్ వాచ్ ఖరీదు భారత కరెన్సీలో రూ.32 లక్షలు కాగా.. యాక్సిడెంట్ కారణంగా లంబోర్గిన ఓనర్కు అంతకంటే ఎక్కువ నష్టమే జరిగింది. ధ్వంసమైన కారు రిపేరుకు, కూలిన ట్రాఫిక్ సిగ్నల్ స్తంభం పునర్నిర్మాణానికి అతను భారీగా వెచ్చించాల్సి వచ్చింది. అంతేగాక ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసినందుకు జరిమానా కూడా చెల్లించక తప్పలేదు. కారుతో బైకును ఢీకొట్టిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
Motorista de Lamborghini persegue ladrão de Rolex e acaba batendo em poste na Faria Lima em São Paulo pic.twitter.com/AANSrcd6Ov
— BHAZ (@portal_bhaz) May 19, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

