KTM 200 Duke & 250 Duke | ప్రముఖ టూవీలర్స్ తయారీ సంస్థ కేటీఎం ఇండియా తన 200డ్యూక్, 250 డ్యూక్ మోటారు సైకిళ్లు కొత్త రంగుల్లో ఆవిష్కరించింది. కేటీఎం 200 డ్యూక్ మోటారు సైకిల్ – ఎలక్ట్రానిక్ ఆరెంజ్, డార్క్ గాల్వానో, కేటీఎం250 డ్యూక్ మోటారు సైకిల్ అట్లాంటిక్ బ్లూ రంగులో వస్తున్నాయి. కేటీఎం250 డ్యూక్ మోటారు సైకిల్ రూ.2.40 లక్షలు (ఎక్స్ షోరూమ్), కేటీఎం 200 డ్యూక్ మోటారు సైకిల్ ధర రూ.1.97 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
కేటీఎం 200 డ్యూక్ మోటారు సైకిల్ 200సీసీ సెగ్మెంట్ లో అత్యంత పాపులర్ మోటారు సైకిల్. 2023లో న్యూ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ తో అప్ డేట్ చేశారు. బీఎస్-6 రెండో దశ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న బైక్ ఇంజిన్ 10,000 ఆర్పీఎం వద్ద 24.68 బీహెచ్పీ విద్యుత్, 8,000 ఆర్పీఎం వద్ద 19.3 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్సు యూనిట్ తో వస్తున్నది. కేటీఎం 250 డ్యూక్ మోటారు సైకిల్ 249సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో వస్తున్నది.