Wimbledon 2023 | వింబుల్డన్ డ్రా.. ఈసారి టాప్ సీడ్లు చెమటోడ్చాల్సిందేనా..!
Wimbledon 2023 : ఈ ఏడాది వింబుల్డన్ టోర్నమెంట్( Wimbledon 2023) డ్రా వచ్చేసింది. గ్రాండ్‌స్లామ్ నిర్వాహకలు ఈ రోజు డ్రా వివరాలు వెల్లడించారు. పురుషుల సింగిల్స్ వలర్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz), మహిళల టాప్ సీడ్ ఇగా స్వియటెక్(Iga Swiatek)లకు కఠినమైన డ్రా ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్ 2...
Wimbledon 2023 : ఈ ఏడాది వింబుల్డన్ టోర్నమెంట్( Wimbledon 2023) డ్రా వచ్చేసింది. గ్రాండ్‌స్లామ్ నిర్వాహకలు ఈ రోజు డ్రా వివరాలు వెల్లడించారు. పురుషుల సింగిల్స్ వలర్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz), మహిళల టాప్ సీడ్ ఇగా స్వియటెక్(Iga Swiatek)లకు కఠినమైన డ్రా ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్ 2 నొవాక్ జకోవిచ్(Novak Djokovic)కు కూడా సులభమై డ్రా దొరికింది. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన అతను క్వార్టర్ ఫైనల్లో ఆండ్రే రుబ్లెవ్‌ను ఢీ కొట్టనున్నాడు.
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఎలీనా రిబాకినా(Elena Rybakina)కు కూడా గట్టి పోటీ ఎదురుకానుంది. వింబుల్డన్ టోర్నమెంట్ జూలై 3వ తేదీ నుంచి జూలై 16 వరకు జరగనుంది. ఈ వారమే క్వీన్స్ క్లబ్ (Queens Club)టైటిల్ గెలిచిన అల్కరాజ్ వింబుల్డన్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే. ఇప్పటివరకు గ్రాస్ కోర్టులో నాలుగో రౌండ్ దాటలేదు. దాంతో, ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనుకుంటున్న అతడికి ఆ తర్వాతి రౌండ్లలో గట్టి పోటీ ఎదురుకానుంది.
Gentlemen’s Singles – Projected Quarter-finals
Carlos Alcaraz vs Holger Rune
Daniil Medvedev vs Stefanos TsitsipasJannik Sinner vs Casper Ruud
Andrey Rublev vs Novak Djokovic#Wimbledon— Wimbledon (@Wimbledon) June 30, 2023
తొలి మ్యాచ్‌లో ఈ యువ సంచలనం 534వ ర్యాంకర్ జెరెమీ చార్డీతో తలపడనున్నాడు. 6వ సీడ్ హోల్గర్ రునే లేదా ఫ్రాన్సెస్ తైఫోతో క్వార్టర్ ఫైనల్ ఆడనున్నాడు. సెమీఫైనల్ బెర్తు కోసం అతను మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్, స్టెఫనోస్ త్సిత్సిపాస్ లేదా కామెరూన్ నోరీలలో ఒకరిని ఢీ కొంటాడు.
నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాజ్

వింబుల్డన్‌లో సీడింగ్ దక్కించుకోలేకపోయిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే(Andy Murray) తమ దేశానికే చెందిన రియాన్ పెనిస్టోన్తో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. నిరుడు ఫైనల్ ఆడిన నిక్ కిర్గియోస్(Nick Kyrgios) 30వ ర్యాంక్‌తో బరిలోకి దిగుతున్నాడు. అతడు తొలి మ్యాచ్‌లో వైల్డ్ కార్ట్ ఎంట్రీ లభించిన డేవిడ్ గొఫిన్తో ఆడనున్నాడు.
ఇవి కూడా చదవండి
Ashes Series | స్టార్క్ దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం
AB de Villiers | ఆ రోజు మస్త్ జ్వరం.. ఇంజెక్షన్లు తీసుకుని రికార్డు సెంచరీ కొట్టిన : డివిలియర్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

