AB de Villiers : క్రికెట్లో మిస్టర్ 360 డిగ్రీ ఆటగాడు(Mister 360 Player) ఎవరు?.. అనగానే ఏబీ డివిలియర్స్( AB de Villiers ) అని ఠక్కున చెప్పేస్తాం. మెరుపు ఇన్నింగ్స్‌లకు పేరొందిన డివిలియర్స్ సంచలన బ్యాటింగ్‌తో ఆటపై తన ముద్ర వేశాడు. ఈ దిగ్గజ ఆటగాడు తన కెరీర్‌లోని ముఖ్యమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. జియో సినిమా(Jio Cinema) ‘హోమ్ ఆఫ్ హీరోస్'(Home Of Heroes) షోలో మాట్లాడిన డివిలియర్స్ 2015 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్(Westindies)పై ఆడిన సంచలన ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు.
మ్యాచ్‌కు ముందు రోజు జర్వంతో బాధ పడ్డానని, ఇంజెక్షన్లు తీసుకొని బ్యాటింగ్‌కు వచ్చానని ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ తెలిపాడు. ‘మ్యాచ్ రోజు ఉదయం 3 గంటలకు నాకు మస్త్ జ్వరం వచ్చింది. అయినాసరే ఎలాగైనా మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నా. కానీ, రాత్రంతా నిద్ర లేకపోవదు. దాంతో, ఇంజెక్షన్లు తీసుకొని నిద్రపోయా. నా బ్యాటింగ్ రాగానే బెడ్డు మీద నుంచి లేచి సరాసరి మైదానంలోకి వచ్చాను.
2015 వరల్డ్ కప్ – డివిలియర్స్ 162 నాటౌట్
మ్యాచ్ కోసం వామప్ కూడా చేయలేదు’ అని డివిలియర్స్ వెల్లడించాడు. ఆరోజు ఈ స్టార్ ప్లేయర్ 162 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. వన్డేల్లో వేగంగా 150 పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆ మ్యాచ్లోదక్షిణాఫ్రికా 257 పరుగుల తేడాతో గెలుపొందింది.
దక్షిణాఫ్రికా తరఫున డివిలియర్స్ 138 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో, వేగవంతమైన సెంచరీ, 150 రన్స్ కొట్టిన అటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ 360 డిగ్రీ ప్లేయర్ టెస్టుల్లో 22, వన్డేల్లో 25 సెంచరీలు బాదాడు. అంతేకాదు ఐపీఎల్(IPL)లోనూ ఈ స్టార్ ఆటగాడు మెరుపులు మెరిపించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు() జట్టుకు ఆడిన డివిలియర్స్ 5,030 పరుగులు చేశాడు. అందులో 3 శతకాలు, 38 అర్ధ శతకాలు ఉన్నాయి.