Ashes Series | యాషెస్ రెండో టెస్టు.. స్టార్ స్పిన్నర్ లియాన్‌కు గాయం
Ashes Series : లార్డ్స్ వేదికగా జరుగుతున్న యాషెస్(Ashes Series) రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆ ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ మూడో రోజు ఆటకు దూరం కానున్నాడు. అవును.. గాయపడిన అతను మూడో రోజు రెండు స్టాండ్స్(crutches) సాయంతో నడుస్తూ కెమెరా కంట పట్టాడు. రెండో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా....
Ashes Series : లార్డ్స్ వేదికగా జరుగుతున్న యాషెస్(Ashes Series) రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆ ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ మూడో రోజు ఆటకు దూరం కానున్నాడు. అవును.. గాయపడిన అతను మూడో రోజు రెండు స్టాండ్స్(crutches) సాయంతో నడుస్తూ కెమెరా కంట పట్టాడు. రెండో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా లియాన్ కుడి కాలి(Right Calf)కి దెబ్బ తగిలింది. నొప్పితో విలవిలలాడిన అతడికి ఫిజియో వెంటనే చికిత్స అందించాడు. అయితే గాయం తీవ్రత తెలుసుకోవడం కోసం అతడిని స్కానింగ్ కోసం పంపారు.
దాంతో, అతను మైదానంలోకి దిగే అవకాశం లేదు. ఇది నిజంగా ఆసీస్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే..? పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ విన్నర్ అయిన లియాన్ జట్టులో లేకపోవడం కమిన్స్ సేనకు ప్రతికూలమే. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లియాన్ 4 వికెట్లు తీయడమే కాకుండా కమిన్స్‌తో కలిసి 9వ వికెట్‌కు 55 పరుగులు జోడించాడు.
సెంచరీ చేజార్చుకున్న బెన్ డకెట్

బెన్ డకెట్, పోప్ దూకుడు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు హోరాహోరీగా జరగుతోంది. తొలి రోజు ఆసీస్ జోరు కొనసాగిస్తే… రెండో రోజు ఆతిథ్య జట్టు ఆటగాళ్లు దంచి కొట్టారు. ఓపెనర్లు బెన్ డకెట్(98), జాక్ క్రాలే(48), ఓలీ పోప్(42) బాజ్‌బాల్ ఆటతో హడలెత్తించారు. ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 278పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్(45 నాటౌట్), బెన్ స్టోక్స్(17 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మొదట ఆడిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 రన్స్ కొట్టింది. స్టీవ్ స్మిత్(110) వరుసగా రెండో శతకంతో ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ట్రావిస్ హెడ్(77), డేవిడ్ వార్నర్(0) అర్ధ శతకాలు బాదడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగింది. తొలి టెస్టులో గెలిచిన కమిన్స్ సేన ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Majid Ali | పాక్ అగ్రశ్రేణి స్నూకర్ ప్లేయర్ ఆత్మహత్య
విదేశాల్లో వినేశ్, బజరంగ్ శిక్షణ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

