Avika Gor | అవికా గోర్ తొలి వాలెంటైన్స్ డే .. ప్రేమకు కొత్త నిర్వచనం ఇచ్చిన జంట
Avika Gor | పెళ్లి తర్వాత తమ తొలి వాలెంటైన్స్ డేను నటి అవికా గోర్, ఆమె భర్త మిలింద్ చంద్వానా ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా జరుపుకుంటున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు ఇది మొదటి ప్రేమికుల దినోత్సవం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఖరీదైన వేడుకలు, హంగామాలకంటే తమ బంధాన్ని మరింత గాఢంగా అనుభవించడం, కలిసి గడిపే సమయానికే ప్రాధాన్యం ఇస్తున్నామని అవికా తెలిపింది
Avika Gor | పెళ్లి తర్వాత తమ తొలి వాలెంటైన్స్ డేను నటి అవికా గోర్, ఆమె భర్త మిలింద్ చంద్వానా ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా జరుపుకుంటున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు ఇది మొదటి ప్రేమికుల దినోత్సవం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఖరీదైన వేడుకలు, హంగామాలకంటే తమ బంధాన్ని మరింత గాఢంగా అనుభవించడం, కలిసి గడిపే సమయానికే ప్రాధాన్యం ఇస్తున్నామని అవికా తెలిపింది. “ఇది కేవలం ఒక రోజు కాదు… మేము కలిసి నిర్మించుకుంటున్న మా చిన్న ప్రపంచాన్ని గౌరవించుకునే సందర్భం” అని ఆమె భావోద్వేగంగా పేర్కొంది.
వాలెంటైన్స్ డే అంటే బహుమతులు, డైమండ్ రింగులు కాదని… ఒక ప్రాణాన్ని కాపాడటమే తమకు గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని ఈ జంట చెబుతోంది. ఇటీవల షూటింగ్ సమయంలో వీధి కుక్కల బారి నుంచి ఒక చిన్న పిల్లిని కాపాడి ‘షిరీ’ అని పేరు పెట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చారు. సంప్రదాయ గిఫ్టులకంటే ఈ నిర్ణయమే తమ ఆలోచనలూ, విలువలూ ఒకటేనని చెప్పే నిదర్శనమని అవికా పేర్కొంది. రొమాన్స్ అంటే గొప్ప సెట్టింగ్స్ కాదు, కష్టకాలాల్లో ఒకరికొకరు అండగా నిలబడటం, కలిసి నవ్వుకోవడం, చేతులు పట్టుకుని నడవాలని అనిపించడమే అసలైన ప్రేమ అని ఆమె అభిప్రాయపడింది.
పెళ్లి తర్వాత వచ్చిన ప్రశాంతత తమ బంధాన్ని మరింత బలపరచిందని చెప్పిన ఈ జంట ఇటీవల పతి పత్ని ఔర్ పంగా రియాలిటీ షోలో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక అవికా గోర్ విషయానికి వస్తే ఈ అమ్మడు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో ఎంతగానో అలరిస్తూ ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

