Nagarkurnool | నాగర్‌కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివారులో వ్యాన్ అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. పలువురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
మృతులను కర్ణాటకకు చెందిన ప్రయాణికులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 10 మంది ఉన్నారు. వీరంతా కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.