Ashes Series | స్టార్క్ దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం
Ashes Series : యాషెస్(Ashes) రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. లార్డ్స్ మైదానం(Lords Stadium)లో రెండో రోజు ప్రదర్శించిన దూకుడును మూడో రోజు కొనసాగించలేకపోయారు. బాజ్‌బాల్(BazzBall) ఆటతో అదరగొడతారనుకున్న హ్యారీ బ్రూక్(50), బెన్ స్టోక్స్(17), జానీ బెయిర్‌స్టో(16) నిరాశపరిచారు. దాంతో, ఆతిథ్య జట్టు...
Ashes Series : యాషెస్(Ashes) రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. లార్డ్స్ మైదానం(Lords Stadium)లో రెండో రోజు ప్రదర్శించిన దూకుడును మూడో రోజు కొనసాగించలేకపోయారు. బాజ్‌బాల్ (BazzBall) ఆటతో అదరగొడతారనుకున్న హ్యారీ బ్రూక్(50), బెన్ స్టోక్స్(17), జానీ బెయిర్‌స్టో(16) నిరాశపరిచారు. దాంతో, ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకే ఆలౌటయ్యింది. పర్యాటక ఆస్ట్రేలియాకు 91 పరుగులు ఆధిక్యాన్ని సమర్పించుకుంది.
ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) మూడు వికెట్లతో చెలరేగాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్(Travis Head), జోష్ హేజిల్‌వుడ్ రెండేసి వికెట్లతో ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. ఓవర్ నైట్ స్కోర్ 278/4 తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. హాఫ్ సెంచరీ కొట్టిన హ్యారీ బ్రూక్(50)ను స్కార్ట్ ఔట్ చేశాడు. ఆ కొద్ది సేపటికే కెప్టెన్ బెన్ స్టోక్స్(17) ఒక్క పరుగు చేయకుండానే వెనుదిరిగాడు. ఆదుకుంటాడనుకున్న జానీ బెయిర్‌స్టో(16)ను హేజిల్‌వుడ్ వెనక్కి పంపాడు.
స్టోక్స్‌ను ఔట్ చేసిన ఆనందంలో స్టార్క్

జోష్ టంగ్ వికెట్‌తో..
దాంతో, ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. జోష్ టంగ్(1)ను కమిన్స్ ఔట్ చేయడంతో 325 పరుగుల వద్ద స్టోక్స్ సేన ఆలౌటయ్యింది. దాంతో, ఆసీస్‌కు 91 పరుగలు ఆధిక్యం లభించింది. మొదట ఆడిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 రన్స్ కొట్టింది. స్టీవ్ స్మిత్(110) వరుసగా రెండో శతకంతో ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ట్రావిస్ హెడ్(77), డేవిడ్ వార్నర్(0) అర్ధ శతకాలు బాదడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగింది. తొలి టెస్టులో గెలిచిన కమిన్స్ సేన ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
AB de Villiers | ఆ రోజు మస్త్ జ్వరం.. ఇంజెక్షన్లు తీసుకుని రికార్డు సెంచరీ కొట్టిన : డివిలియర్స్
France Footballer | 10 వేల మందితో శృంగారంలో పాల్గొన్నా.. ఫ్రాన్స్ మాజీ ఫుట్‌బాలర్ షాకింగ్ కామెంట్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

