మధిర, డిసెంబర్ 27 : మధిర పట్టణంలోని పలు వార్డుల్లో ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ లింగాల కమల్ రాజు శనివారం పర్యటించారు. పట్టణంలోని 9, 19, 21 వార్డుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఇటీవల మరణించిన పగడాల నాగమణి, కమతం ప్రవీణ్ తల్లి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. 19వ వార్డు బంజారా కాలనీలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంపసాల కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ ఎల్లవేళలా వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 9వ వార్డులో ఇటీవల కన్నుమూసిన లిటిల్ ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత మండూరి నారాయణరావు కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ పర్యటనలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, మాజీ ఫ్లోర్ లీడర్ యన్నం శెట్టి వెంకట అప్పారావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ దిరావత్ మాధవి, పల్లపాటి కోటేశ్వరరావు, ఆళ్ల నాగబాబు, వేల్పుల శివ, చీదిరాల రాంబాబు, పరిస శ్రీనివాసరావు, నాగులవంచ రామారావు, దిల్లు, నీలం రమేష్, గుగులోత్ కృష్ణ నాయక్, ఆరుద్ర కొండలరావు పాల్గొన్నారు.