చేర్యాల, జూన్ 30 : ఇటీవల గాయపడి విశ్రాంతి పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి క్యామ మల్లేష్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకోవడంతో పాటు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అలాగే చేర్యాల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, గుర్జకుంట, దానంపల్లి, పెదరాజుపేట గ్రామశాఖ అధ్యక్షులు బొమ్మగోని బాలరాజు, రాచకొండ కనకయ్య, గర్నెపల్లి రాము, నాయకులు ఎర్రోల్ల యాదగిరి, నంగి రామకృష్ణ, బొప్పనపల్లి అయ్యాలం తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.