తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రం భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ధన త్రయోదశి పురస్కరించుకొని కుభేర లక్ష్మి సహస్ర కుంకుమార్చన (Kumkumarchana) పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు సూర్య భాస్కర కిరణ్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ పూజారులు నవీన్ శర్మ, వినోద్ పంతులు 108 సుహాసినిలతో కుంకుమార్చన నిర్వహించారు.
దీపావళి పండుగ సందర్భంగా మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులను సమర్పించుకున్నారు. పూజలలో పాల్గొన్న మహిళలకు ఆలయ కమిటీ నిర్వాహకులు సౌకర్యాలను కల్పించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు మద్దికుంట రామచందర్, రాజయ్య, నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.