నార్నూర్ : ఆదివాసుల సంస్కృతి(Culture) , సాంప్రదాయాలు చాలా గొప్పవని వాటిని భావితరాలకు అందించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం జామడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన దండారి ఉత్సవాల్లో (Dandari festival) ఎస్పీ పాల్గొన్నారు. గుస్సాడి, వాయిద్యాలతో ఎస్పీకి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏత్మాసూర్ పేన్ కు సాంప్రదాయ పూజలు చేసిన అనంతరం ఆదివాసి పెద్దలు శాలువాతో సన్మానించారు.
ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసులు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మూఢనమ్మకాల ను విశ్వసించకుండా వ్యాధుల బారిన పడితే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. బాబాలు, మంత్రగాళ్లను నమ్మవద్దన్నారు. పిల్లలకు చదువు పట్ల గల ప్రాధాన్యతను తెలియజేయాలని కోరారు.
అంతకుముందు ఆ గ్రామానికి చెందిన 50 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్, నార్నూర్ సీఐ డి. పద్మ, ఎస్సైలు సాయన్న, అఖిల్, రాయి సెంటర్ జిల్లా సార్ మేడి మేస్రం దుర్గుపటేల్, తహసీల్దార్ జాడి రాజాలింగం, ఎంపీడీవో రాథోడ్ గంగా సింగ్, నాయకులు రామకృష్ణ, కోశేరావ్. వెంకటరావ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.