ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ ( Asifabad ) జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు మరో ఇద్దరు దుర్మరణం చెందారు. నలుగురు సభ్యులు గల కుటుంబం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆసిఫాబాద్ మండలం మోతుగూడ దగ్గర వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వంజిరి గ్రామానికి చెందిన డొంగ్రే సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. మరో చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.