అన్నదాతలకు కేటీఆర్ అండ
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఇటీవల ఆత్మహత్యలు చేసుకొన్న నలుగురు రైతు కుటుంబాలను ఆదివారం కేటీఆర్ పరామర్శించారు.
- తలమడుగులో బాధిత కుటుంబాలకు పరామర్శ
- ఉమ్మడి జిల్లాలో 100కు పైగా రైతుల ఆత్మహత్యలు
- ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం
ఆదిలాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఇటీవల ఆత్మహత్యలు చేసుకొన్న నలుగురు రైతు కుటుంబాలను ఆదివారం కేటీఆర్ పరామర్శించారు. వారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నాలుగు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. చనిపోయిన వారి చిత్రపటాల వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అథోగతి పాలై, ఆగమాగమై అప్పులు పెరిగి ఏమి చేయాలో దిక్కు తోచక నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన చెందారు.
కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనంతో రాష్ట్రంలో వెయ్యి మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, ఇవి రైతుల ఆత్మహత్యలు కావని హత్యలు అని కేటీఆర్ మండిపడ్డారు. తలమడుగులో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకొనే దౌర్భగ్య పరిస్థితి వచ్చిందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి పైచిలుకు రైతులు ఆత్మహత్యలు జరిగినట్లు తెలిపారు.
ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాట్లు వేసే సమయానికి రైతుబంధు పడిందని, రైతు ఎలా చనిపోయినా రూ.5 లక్షలు 15 రోజుల్లో చనిపోయి రైతు కుటుంబ సభ్యులకు అందాయన్నారు. పంటలకు యూరియా, ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడంతోపాటు రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో యూరియా దిక్కు లేదు, కరెంటు ఎప్పుడు వస్తాదో తెలియదని, పత్తి కొనేవాళ్లు ఎవరో తెలియదని కిసాన్ కపాస్ యాప్ అని పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను సతాయిస్తున్నట్లు తెలిపారు.
ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల సాయం
ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టికోవడం లేదని, రైతు బీమా ఇవ్వడం లేదని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షలు ఇచ్చామని.. ఈ డబ్బులు సరిపోవని, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ చేతకాని తనంతో జరిగిన హత్యలు తప్ప ఆత్మహత్యలు కావన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు కష్టాలు పడుతున్నారని అన్నారు.
కరువు మండలంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తలమడుగు మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలని సూచించారు. తొమ్మిదన్నర సంవత్సరాల కేసీఆర్ పాలన ఎట్ల ఉండే, మూడు సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఎట్ల ఉందనే విషయాన్ని రైతులు గమనిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేసి రైతులను ఆదుకున్నదని, కాంగ్రెస్ పాలనలో రైతులు చనిపోయినా ఎలాంటి సాయం అందడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని, బీఆర్ఎస్కు రైతులు, ప్రజలు అండగా ఉండాలని కోరారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

