మీ గ్రాట్యుటీ ఎంతో తెలుసా?
వరుసగా ఐదేండ్లు (కొన్ని పరిస్థితుల్లో, ఆయా రంగాల్లో ఈ కాలపరిమితికి మార్పులుంటాయి) ఒకే సంస్థలో పనిచేసిన రెగ్యులర్/శాశ్వత ఉద్యోగులు రాజీనామా చేసో లేక రిటైరై వెళ్తున్నప్పుడో లేదా మరే ఇతర కారణాల చేతనో సంస్థను వీడాల్సి వచ్చినప్పుడు గ్రాట్యుటీ పొందే వీలున్నది.
వరుసగా ఐదేండ్లు (కొన్ని పరిస్థితుల్లో, ఆయా రంగాల్లో ఈ కాలపరిమితికి మార్పులుంటాయి) ఒకే సంస్థలో పనిచేసిన రెగ్యులర్/శాశ్వత ఉద్యోగులు రాజీనామా చేసో లేక రిటైరై వెళ్తున్నప్పుడో లేదా మరే ఇతర కారణాల చేతనో సంస్థను వీడాల్సి వచ్చినప్పుడు గ్రాట్యుటీ పొందే వీలున్నది. అయితే ఈ గ్రాట్యుటీ ఎంత వస్తుంది? దాని గణనకు కంపెనీలు అనుసరించే విధానం ఏమిటి? అనేది చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి ఐదేండ్లలోపే సర్వీసు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అంగవైకల్యం ఏర్పడ్డా, లేదా చనిపోయినా గ్రాట్యుటీకి అర్హులే.
అలాగే ఫిక్స్డ్-టర్మ్ ఎంప్లాయీస్ (వివిధ ప్రాజెక్టుల కోసం నిర్ణీత కాలపరిమితికిగాను నియమించుకునే ఉద్యోగులు)కు ఏడాది పనిచేసినా ప్రో-రాట ప్రాతిపదికన గ్రాట్యుటీకి అర్హత ఉంటుందని కొత్త చట్టాలు చెప్తున్నాయి. ఇక ఈ గ్రాట్యుటీ లెక్కింపు విషయానికొస్తే.. ఉదాహరణకు ఓ కంపెనీలో పనిచేస్తున్న ప్రణయ్‌కి అక్కడ పదేండ్ల అనుభవం ఉన్నది. ఆయన చివరిసారిగా అందుకున్న నెలవారీ వేతనంలో బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ (డీఏ) (వర్తిస్తే రిటైనింగ్ అలవెన్స్-ఆర్ఏ) కలిపి రూ.30,000గా ఉన్నది. అప్పుడు గ్రాట్యుటీ రూ.1,73,076 వస్తుంది.
ఇందుకు వర్తించే లెక్క ఏమిటంటే? కంపెనీలో ప్రణయ్కున్న అనుభవం (పదేండ్లు-10)తో బేసిక్, డీఏ, ఆర్ఏ (రూ.30,000) మొత్తాన్ని గుణించాలి. ఆ వచ్చిన మొత్తం (రూ.3,00,000)ను 15/26 ఫార్ములాతో మళ్లీ గుణించాలి. అప్పుడు రూ.1,73,076 వస్తుంది. ఇదే పదేండ్ల కాలానికిగాను ప్రణయ్‌కి వచ్చే గ్రాట్యుటీ మొత్తం. ఇలా ఎన్నేండ్లు పనిచేస్తే అన్నేండ్లు, చివరి నెలలో బేసిక్ పే, డీఏ, ఆర్ఏలతో కలిసి గుణించి, ఆ మొత్తాన్ని 15/26తో మళ్లీ గుణిస్తే గ్రాట్యుటీ వచ్చేస్తుంది.
- 15/26 ఫార్ములాలో 15 అనేది ఉద్యోగి సర్వీస్‌లో ప్రతి ఏడాదికి 15 రోజుల చొప్పున వేతనాన్ని సూచిస్తుంది. 26 అనేది ప్రతి నెలలో సగటున ఉండే పని దినాలను సూచిస్తుంది.
- ఒకవేళ మీరు 10 ఏండ్ల 6 నెలలు లేదా 12 ఏండ్ల 6 నెలలు పనిచేస్తే అప్పుడు అక్కడ మీ అనుభవాన్ని 11 లేదా 13 ఏండ్లుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఏడాదిలో ద్వితీయార్ధంలోకి ప్రవేశిస్తే చాలు.. ఇంకా ఎన్ని నెలలు మిగిలి ఉన్నా గ్రాట్యుటీ లెక్కింపులో పూర్తి సంవత్సరంగానే పరిగణిస్తారు.
- గ్రాట్యుటీ చట్టాలకు లోబడి ఉన్న ఉద్యోగులకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 10(10) కింద రూ.20 లక్షలదాకా పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పరిమితి దాటితే మీ వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబు ప్రకారం పన్నులు వర్తిస్తాయి.
- 30 రోజుల్లోగా ఉద్యోగులకు సంస్థ యాజమాన్యాలు గ్రాట్యుటీ సొమ్మును ఇవ్వాల్సి ఉంటుంది. ఆలస్యమైతే బకాయిలకు నిర్ణీత వడ్డీని చెల్లించాల్సిందే. సాధారణంగా నిబంధనల ప్రకారం ఈ వడ్డీరేటు 10 శాతంగా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

