కివీస్‌దే ముగింపు మురిపెం
న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను భారత్ ఓటమితో ముగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ముందే సిరీస్ దక్కించుకున్నా తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఆతిథ్య జట్టు అనూహ్యంగా పుంజుకుని భారత ఆధిక్యాన్ని 3-2కు తగ్గించింది.
- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ ఘనవిజయం
- సీఫర్ట్, ఫిలిప్స్ బాదుడు
- బంతితో చేతులెత్తేసిన భారత్
- చివరి మ్యాచ్‌లో ఓడినా సిరీస్ 3-2తో కైవసం
హమిల్టన్: న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను భారత్ ఓటమితో ముగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ముందే సిరీస్ దక్కించుకున్నా తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఆతిథ్య జట్టు అనూహ్యంగా పుంజుకుని భారత ఆధిక్యాన్ని 3-2కు తగ్గించింది. ఆదివారం హమిల్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని శాంట్నర్ సేన మరో రెండు ఓవర్లు మిగిలుండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది.
ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 93) వీరబాదుడుకు తోడు సిరీస్‌లో అత్యద్భుతమైన ఫామ్ కనబరిచిన గ్లెన్ ఫిలిప్స్ (38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 నాటౌట్) అజేయ అర్ధశతకంతో మెరుపులు మెరిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), శ్రేయాస్ అయ్యర్ (23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలకు తోడు నమన్ ధీర్ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) మెరుపులతో నిర్ణీత ఓవర్లకు 191/8 చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఆడమ్ మిల్నే (4/19) నాలుగు వికెట్లతో రాణించాడు. సిరీస్‌లో 341 రన్స్ చేసిన ఫిలిప్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది. టీ20లు ముగియగా ఈనెల 4 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.
సీఫర్ట్ మెరుపులు.. ఫిలిప్స్ ఫినిషింగ్ టచ్
ఈ సిరీస్‌లో 200+ లక్ష్యాలను అవలీలగా ఛేదించిన నేపథ్యంలో 192 పెద్ద కష్టమేమీ కాకపోయినా భారత బౌలర్లు ఏమైనా మాయ చేయకపోతారా? అని ఆశించిన ఇండియా ఫ్యా న్స్‌కు మరోసారి నిరాశే ఎ దురైంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అర్ష్‌దీప్.. ఫిన్ అలెన్ (2)ను ఔట్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశాడు. ఐదో ఓవర్లో బంతినందుకున్న ప్రిన్స్‌కు డారిల్ మిచెల్ (29) రెండు భారీ సిక్స్‌లతో స్వాగతం పలికాడు. తొలుత 15 బంతుల్లో 14 రన్స్ మాత్రమే చేసిన సీఫర్ట్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా అర్ష్‌దీప్ బౌలింగ్‌లో అతడిచ్చిన క్యాచ్‌ను నమన్ ధీర్ జారవిడవడంతో అయ్యర్ సేన అందుకు భారీగానే మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
భువీ వేసిన ఆరో ఓవర్లో 4, 6, 6, 4తో సీఫర్ట్ గేర్ మార్చాడు. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన వరుణ్ చక్రవర్తి 9వ ఓవర్లో మిచెల్‌ను ఔట్ చేసినా భారత శిబిరంలో ఆనందం లేదు. ఫిలిప్స్‌కు జతకలిసిన సీఫర్ట్ మరింత రెచ్చిపోయాడు. మిచెల్‌తో రెండో వికెట్‌కు 73 రన్స్ జోడించిన అతడు ఫిలిప్స్‌తో మూడో వికెట్‌కు 86 పరుగులు జతచేసి మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పుకున్నాడు. నితీశ్ విసిరిన పదో ఓవర్లో సిక్స్‌తో సిరీస్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన అతడు.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదడంతో 12 ఓవర్లకే కివీస్ 120/2తో గెలుపును దాదాపుగా ఖాయం చేసుకుంది. 16వ ఓవర్లో నితీశ్.. సీఫర్ట్‌ను క్లీన్‌బౌల్డ్ చే సినా అప్పటికే కివీస్ విజయం ఖాయమైంది. ఫిలిప్స్.. 17వ ఓవర్లో 6, 4తో ఈ సిరీస్‌లో నాలుగో అర్ధ శతకాన్ని బాదడమే గాక భువీ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో మ్యాచ్‌ను ముగించాడు.
ఆ ఇద్దరే..
ఇషాన్, శ్రేయాస్ మెరుపులు లేకుంటే భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయకపోయేది. నిలకడ లేమితో కొనసాగుతున్న సంజూ శాంసన్ (4) మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగగా అభిషేక్ (1) సైతం నిరాశపరిచాడు. 19/2తో ఉన్న భారత్‌ను ఇషాన్, శ్రేయాస్ ద్వయం ఆదుకుంది. మొదట్నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ బౌండరీలు, సిక్స్‌లతో అలరించడంతో పర్యాటక జట్టు స్కోరు రాకెట్ వేగాన్ని అందుకుంది. శాంట్నర్ ఓవర్లో ఇషాన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే సమయంలో అలెన్ కాలు గ్రౌండ్‌కు తాకిందని తేలడంతో అతడు బతికిపోయాడు.
ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అతడు ఫిఫ్టీ పూర్తిచేశాడు. బ్రేస్‌వెల్ పదో ఓవర్లో అయ్యర్ హ్యాట్రిక్ సిక్స్‌లతో రెచ్చిపోగా ఇషాన్ కూడా 6, 4 కొట్టడంతో పది ఓవర్లకు 111/2తో భారత్ మెరుగ్గానే నిలిచింది. కానీ టిక్నర్ 11వ ఓవర్లో ఇషాన్‌ను ఔట్ చేయడం, ఆ వెంటనే 50 రన్స్ పూర్తయ్యాక అయ్యర్ కూడా నిష్క్రమించడంతో టీమిండియా బాదుడులో వెనుకబడింది. తిలక్ వర్మ (6) కూడా తేలిపోయాడు. నమన్ ధీర్, నితీశ్‌కుమార్ (22) మెరుపులతో భారత్ పోరాడగలిగే స్కోరు చేయగల్గింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లకు 191/8 (ఇషాన్ 61, శ్రేయాస్ 50, మిల్నే 4/19, స్మిత్ 2/28); న్యూజిలాండ్: 18 ఓవర్లకు 195/3 (సీఫర్ట్ 93, ఫిలిప్స్ 65*, నితీశ్ 1/19, అర్ష్‌దీప్ 1/45)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

