కేటీఆర్ వస్తేనే రైతులకు న్యాయం.. రైతు గర్జన సభలో మాజీ మంత్రి జోగు రామన్న
రెండేండ్ల క్రితం అక్టోబర్‌లో కేటీఆర్ ఆదిలాబాద్‌కు వస్తేనే రైతులకు న్యాయం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన రైతుగర్జన సభలో ఆయన మాట్లాడుతూ..
మంచిర్యాల, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రెండేండ్ల క్రితం అక్టోబర్‌లో కేటీఆర్ ఆదిలాబాద్‌కు వస్తేనే రైతులకు న్యాయం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన రైతుగర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు బీఆర్ఎస్, కేటీఆర్ అండగా నిలిచారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతుబీమా ప్రీమియం అయిపోయాక జిల్లాలో 108 మంది రైతులు చనిపోయారని చెప్పారు.
ఆ రైతులకు అండగా ఉండి ప్రభుత్వంలో మాట్లాడి బీమా ఇప్పించాలని కేటీఆర్‌ను కోరారు. లక్షా 60 వేల మంది రైతులు ఉంటే రుణమాఫీ కేవలం 60వేల మందికే చేశారని ఆరోపించారు. లక్షమందికి రుణమాఫీ ఎగ్గొట్టిన రాక్షసుడు రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నిలదీయడానికే ఈ సభ పెట్టామని స్పష్టంచేశారు. ఆదిలాబాద్ రైతులు కష్టాల్లో ఉంటే ఇక్కడి ఎమ్మెల్యే ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్‌లో కమిషన్‌కు ఆశపడి బతుకుతున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు కనుసన్నల్లో పని చేస్తున్న రేవంత్‌రెడ్డి గురుదక్షిణగా మన నీళ్లు ఆంధ్రాకు దోచి పెడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్‌ది రాముని పాలన.. రేవంత్‌ది రాక్షస పాలన
- భార్గవ్ దేశ్‌పాండే
పదేండ్లపాటు కేసీఆర్ రాముని పాలన చూసిన తెలంగాణ.. మూడేండ్లుగా రేవంత్‌రెడ్డి రాక్షస పాలన చూస్తున్నదని బీఆర్ఎస్ యువనాయకుడు భార్గవ్ దేశ్‌పాండే పేర్కొన్నారు.

అన్నదాతల బాధను ఆదిలాబాద్ గడ్డ నుంచి రాష్ట్రం మొత్తానికి చాటిచెప్పేందుకు కేటీఆర్ వచ్చారని చెప్పారు.
రైతులు చేయి చాచే దుస్థితి వచ్చింది : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
కేసీఆర్ హయాంలో దేశానికి అన్నం పెట్టిన తెలంగాణ రైతన్న, రేవంత్ పాలనలో చేయిచాచే దుస్థితి వచ్చిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.

ఇటీవల బోథ్‌లో మరణించిన నలుగురు రైతు కుటుంబాలకు కేటీఆర్ పరామర్శించి, భరోసా కల్పించారని చెప్పారు.
రైతులు పంటలు వేయకపోతే.. ఏం పని చేయాలి : కోవ లక్ష్మి
రైతులను పంటలు వేయద్దని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్, మరి ఏం చేసి బతుకాలో చెప్పాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. చనిపోయిన రైతు కుటుంబాల కన్నీళ్లు తుడువడానికి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడుసార్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు, లోకల్ ఎమ్మెల్యేలు రైతులను పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కరోనా సమయంలోనూ రైతుబంధు ఇచ్చారని గుర్తుచేశారు. రైతులకు మేలు జరుగాలంటే మరోసారి కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ ప్రభుత్వ విప్‌లు బాల్కసుమన్, గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, హన్మంత్ షిండే, దుర్గం చిన్నయ్య, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్, చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ నాయక్, జనార్దన్ రాథోడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

