రైతన్నలూ..ధైర్యంగా బతకండి..మళ్లీ కేసీఆరే వస్తరు..
“కాంగ్రెస్ పాలన కాలం.. ఈ మూడేండ్లలో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బా ధాకరం.
- మోసగాళ్ల ఉచ్చులో ఆదిలాబాద్ గోస పడుతున్నది
- చనాక-కొరాట కట్టింది కేసీఆర్.. కాంగ్రెస్ మూడేళ్లలో తట్టెడు మట్టి ఎత్తలేదు
- తమ్మిడిహట్టిపై మహారాష్ట్ర సీఎం అపాయింట్ మెంట్ తీసుకొనేందుకే మూడేళ్లు పట్టింది..
- మూడేళ్లలో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు.. సీఎంకు కన్నెపల్లి పంపులు ఆన్‌చేసే తెలివి లేదు
- రైతులను మభ్య పెట్టేందుకే రేవంత్‌రెడ్డి తమ్మిడిహట్టి డ్రామాలు
- ఇండస్ట్రీయల్ జోన్ పేరిట ఆదిలాబాద్ ఎమ్మెల్యే దోపిడీ చేస్తున్నడు..
- ఆ దోపిడీకి సీఎం రేవంత్‌రెడ్డి తోడు దొంగ
- రిమ్స్‌లో ప్రమాదానికి ఎలుకలే కారణమా? నల్లమల పిల్లి ఎలుకలను పట్టలేకపోయింది..
- ఆదిలాబాద్ ‘రైతు గర్జన’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మంచిర్యాల, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “కాంగ్రెస్ పాలన కాలం.. ఈ మూడేండ్లలో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బా ధాకరం. రైతులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఒక్క యేడాది ధైర్యంగా బతకండి.. మళ్లీ కేసీఆర్ వస్తరు.. భయపడొద్దు, బాధపడొద్దు, మిమ్మల్ని మళ్లీ ఆదుకుంటరు.. కడుపులో పెట్టుకొని కాపాడుకుంటరు..” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని డైట్ కాలేజీ మైదానంలో నిర్వహించిన ‘రైతు గర్జన’ భారీ బహిరంగ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాళేశ్వర గంగ పారుతుందని.. కన్నెపల్లి పంప్‌హౌస్ సమీపంలో ఈ రోజు 15 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు పారుతున్నా.. ఎత్తిపోయకుండా రాష్ర్టాన్ని రేవంత్‌రెడ్డి కరువులో ముంచుతున్నారని, అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆగ్రహించారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ మోసపోతే గోసపడుతామని చెప్పినట్లే.. మోసగాళ్ల ఉచ్చులో పడి ఆదిలాబాద్ గోస పడుతుందన్నారు.
చనాక-కొరాట, కాళేళ్వరం కట్టించింది కేసీఆరే..
ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగపై ఉన్న చనార-కోరాట ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదన్నారు. కానీ.. కేసీఆర్ సీఎం అయ్యాక మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని దశాబ్దాల కలను సాకారం చేశారన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం మొత్తం పూర్తి చేసి ట్రయల్ రన్ చేశారని పేర్కొన్నారు. కానీ.. మూడేళ్లుగా కాంగ్రెస్ సర్కార్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కాల్వలు త వ్వడం కూడా చేతకావడం లేదన్నారు.

ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్‌కు సంబంధించి మూడేళ్లుగా తట్టె డు మట్టి తీయకుండా దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఉన్న ప్రాజెక్టులకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ తవ్వడానికి చేతగాదు, కాళేశ్వరం కన్నెపల్లి మోటార్లను ఆన్‌చేసే తెలివిలేదు.
తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కడుతానని ఎగిరెగిరిపడిన ముఖ్యమంత్రికి, మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ తెచ్చుకోడానికే మూడేళ్ల సమయం పట్టిందన్నారు. అదే మూడేళ్లలో కేసీఆర్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కట్టారన్నారు. ఇది కేవలం డ్రామా అని.. రైతులను మభ్యపెట్టేందుకే చేసిందని గుర్తించాలన్నారు. అందుకే కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, కరువు, కరెంట్ కోతలు అన్నారు.
ఇండ్రస్ట్రీయల్ కారిడార్ పేరిట ఎమ్మెల్యే దోపిడీ
ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దోపిడీ చేస్తున్నారని, ఆ దోపిడీకి తోడు దొంగ రేవంత్‌రెడ్డి అని కేటీఆర్ మండిపడ్డారు. తాంసి, బేల మండలాల్లో ఇండస్ట్రియల్ జోన్ పేరిట ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆయన కుటుంబ సభ్యులు దోచుకుంటుంటే, దానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వంతపాడుతుందన్నారు. ఇదే తరహాలో చోటేబాయ్ రేవంత్‌రెడ్డి దోపిడీ చేస్తుంటే బడేబాయ్ నరేంద్రమోదీ కల్లుమూసుకొని కూర్చుంటారన్నారు. అందుకే ఇక్కడున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఏ ఒక్కరోజూ నోరుతెరిచి సీఎం రేవంత్‌రెడ్డిని ఒక్క మాట అనలేదన్నారు. గట్టిన నిలదీసింది లేదన్నారు.
అమిత్‌షా వచ్చి ఇదే ఆదిలాబాద్‌లో మాకు ఓటేస్తే, మీకు ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలకు ప్రారంభించి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్నారు. మరి ఈ రోజు అదే సీసీఐని తుక్కు కింద అమ్మేస్తుంటే ఎందుకు ఎంపీ, ఎమ్మెల్యే అడ్డుకోవడం లేదో చెప్పాలన్నారు. ఆ సీసీఐ కోసం ఈ రోజు ఆదిలాబాద్‌లో పోరాటం చేస్తున్న ఒకే ఒక్కడు కొట్లాడుతున్నాడన్నారు. బీజేపీ ఎంపీని, ఎమ్మెల్యేను గెలిపిస్తే ఆదిలాబాద్‌కు ఏమైనా లాభం జరిగిందా.. ఒక్కసారి ఆలోచించాలన్నారు.

నల్లమల పిల్లి ఎలుకలను పట్టలేదు..
ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రమాదం జరిగి 24 మంది పసిపిల్లలు ఆగమైపోయారు. ఐదుగురు పిల్లలు మృతి చెందారు. ఈ ఘటన దానికి కారణం ఎలుకలని ప్రభుత్వం చెప్తుందని, మరీ ఈ రాష్ర్టాన్ని నడుపుతున్నది ఒక నల్లమల పిల్లికదా.. మరి ఆ నల్లమల పిల్లికి ఎలుకలు పట్ట చేతకావడం లేదా? మరీ ఎందుకు నువ్వు ముఖ్యమంత్రివి.. ఆ చిన్నారుల ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారు ముఖ్యమంత్రిని అడుగుతున్నా.. మా నాయకులు పిల్లలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటే పట్టించుకున్న పాపన పోలేదన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ కుటుంబాలకు సాయం అందించామన్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, ఆసిఫాబాద్లకు తలమానికంగా ఉన్న సింగరేణి సంస్థను ఆగం చేసింది రేవంత్ సర్కార్ అన్నారు. రైతులకు కరెంట్ ఇచ్చే బొగ్గులో కుంభకోణం చేశారన్నారు.
ఇవన్నీ ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకుడు భార్గవ్ దేశ్ పాండే, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, సంజయ్‌కుమార్, మాజీ ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, హన్మంత్ షిండే, దుర్గం చిన్నయ్య, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్, చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ నాయక్, జనార్దన్ రాథోడ్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

