హైదరాబాద్: గాంధీ దవాఖానలో వసతుల లేమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు కనీసం కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదంటూ ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే నేనుపోను బిడ్డో సర్కారు దవాఖానకు అనే మాటలే వినిపిస్తాయని చెప్పారు. గాంధీని గాలికి వదిలేసిన కాంగ్రెస్ గాల్లో చక్కర్లు కొండుతున్నదని మండిపడ్డారు. మద్యం ధరల పెంపుపై ఉన్న మక్కువ మందు బిళ్లలపై లేకపాయే అని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఉన్న శ్రద్ధ గాంధీలో మంచి నీళ్లపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళికి బాంబులు వేయడంపై ఉన్న మక్కువ గాంధీలో రోగులపై లేకపాయేనని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
‘గాంధీని గాలికి వదిలి.. గాల్లో చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్,
మధ్యం ధరల పెంపుపై ఉన్న మక్కువ మందు బిళ్లలపై లేకపాయే
విద్యుత్ చార్జీల పెంపుపై ఉన్న మక్కువ గాంధీలో మంచి నీళ్లపై లేకపాయే
మూసీపై ఉన్న మక్కువ గాంధీలో విల్ చైర్లపై లేకపాయే
ఫోర్ బ్రదర్స్ సిటీపై ఉన్న మక్కువ గాంధీలో విరేచనాల మందులపై లేకపాయే
దీపావళికి బాంబులు వేయడంపై ఉన్న మక్కువ గాంధీలో రోగులపై లేకపాయే
అదానీ అంబుజా సిమెంట్ పై ఉన్న మక్కువ గాంధీలో బెటాడిన్ బిళ్లలపై లేకపాయే
నాడు, నేడు, ఎల్లపుడు కాంగ్రెస్ ఉందంటే నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే మాటలే వినిపిస్తాయి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
గాంధీని గాలికి వదిలి- గాల్లో చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్
మధ్యం ధరల పెంపు పై ఉన్న మక్కువ మందు బిళ్లల పై లేకపాయే
విద్యుత్ చార్జీల పెంపు పై ఉన్న మక్కువ గాంధీలో మంచి నీళ్లపై లేకపాయే
మూసీపై ఉన్న మక్కువ గాంధీలో విల్ చైర్లపై లేకపాయే
ఫోర్ బ్రదర్స్ సిటీపై ఉన్న మక్కువ గాంధీలో… pic.twitter.com/6g7RuHuHrg
— KTR (@KTRBRS) October 26, 2024