హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదానికి సిట్ వేస్తుంది కదా.. ఆ పార్టీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ అంశంపైన కూడా సిట్ వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో కేటీఆర్ చిట్ చాట్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు. మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకున్న అంశంపై ఆయన స్పందించారు. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్లే కేసు గురించి ఎన్నికల కమిషన్‌కు చెప్పి ఉంటారన్నారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ‘బ్లాక్ షీప్’ (పార్టీ ద్రోహులు) ఎవరో కనుక్కోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు. అలాంటి కాంగ్రెస్ కంపులో ద్రోహాల పార్టీ అంశంలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారు. మీనాక్షి నటరాజన్‌కి తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసన్నారు.
ముమ్మాటికి ఇది ఆయన కుట్రనే..
ముమ్మాటికీ ఆయన చేసిన పనినే ఇది. కాంగ్రెస్ పార్టీనే కుట్రలు చేసుకొని అందులో ప్రతిపక్షాలను ఎందుకు లాగుతున్నారో తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో పదవులు, డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ చెప్పినం దుకు అభినందనలు. షబ్బీర్ అలీ ఇప్పటికైనా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారు. అసలు గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీనే కదా! ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా డబ్బులకే అమ్ముకున్నదని ఆరోపించారు.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా డబ్బులు పెట్టి పదవి కొనుక్కున్న వ్యక్తే కదా! రేవంత్ రెడ్డి పేమెంట్ కోటా సీటు అన్న విషయం అందరికీ తెలుసు. ప్రతి నెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుంది. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యూవల్ సీఎం అని అందరికీ తెలుసు. కాబట్టి, షబ్బీర్ అలీ చెప్పిన మాటలు ముమ్మాటికీ వాస్తవమన్నారు.
రేవంత్ రెడ్డి ఊహల్లో బతుకుతున్నాడు..
ఎయిర్ పోర్టు మెట్రో పూర్తయితే ఇంత ట్రాఫిక్ ఉండదు, కానీ ఆ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ఆపేశాడని ఆరోపించారు. ఉన్న నగరాన్ని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ అనడం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని ఊహల్లో బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను మరింతగా అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు. రేవంత్ రెడ్డికే ప్యూచర్ లేదు ఇంకా ప్యూచర్ సిటీ ఎంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అసమర్ద పాలనతో రాష్ట్రం 40 ఏండ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి ఒక్క వర్షానికే నగరం చెరువులను తలపించిందన్నారు.
దీనికి రేవంత్ రెడ్డి చేతకాని తనమే కారణమన్నారు. ఎక్కడో ఒకచోటు ఒకటి రెండు చెరువులు బాగు చేసి గొప్పలు చెప్పుకుంటున్నరు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందల చెరువులను సుందరీకరించామని గుర్తు చేశారు. ఇకనైనా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. జులైలో కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందని మాకు సమాచారం ఉందన్నారు. దేశం మొత్తం కాకున్నా.. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలన్నారు.
జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. డీలిమిటేషన్లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా? దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.