Krishnanda Ji Maharaj | హిమాలయాలకు చెందిన సిద్దయోగి శ్రీశ్రీ కృష్ణానంద జీ మహారాజ్‌కు నర్సాపూర్ పట్టణంలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర కబీర్ సేన ప్రెసిడెంట్ సంధ్యారాణి చత్రు నాయక్ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని సబ్ స్టేషన్ వద్ద కృష్ణానందా జీ మహారాజ్‌కు స్వాగతం పలికారు.
అనంతరం నర్సాపూర్ నుండి మండల పరిధిలోని చిప్పల్ తుర్తి సద్గురుదాం ఆశ్రమం వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆయన వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కోశాధికారి రేఖ వెంకటేశం గుప్తా, సభ్యులు శ్రీనివాస్ గౌడ్, దన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Karnataka | ఓటర్ లిస్ట్‌లో అక్రమాలు.. సొంత పార్టీ నేతలపై కర్ణాటక మంత్రి ఫైర్
Srinuvaitla | బాలకృష్ణతో సినిమాపై స్పందించిన శ్రీనువైట్ల.!
Film Federation | ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల నిరసన