టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో క్రిష్ (Krish) ఒకడు. గమ్యం, వేదం, కంచె లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రిష్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో హరిహరవీరమల్లు చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ పొలిటికల్ ప్లాన్ వల్ల తాత్కాలికంగా షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో క్రిష్ ఓ వెబ్ సిరీస్కు ప్లాన్ చేస్తున్నట్టు వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. వేశ్య జీవితం (prostitute life) ఆధారంగా ఈ వెబ్ ప్రాజెక్టు చేయబోతున్నాడట.
ఇప్పటికే తెరకెక్కించిన వేదం చిత్రంలో అనుష్కను వేశ్యపాత్రలో చూపించి..వారి జీవితాలెలా ఉంటాయో చూపించే ప్రయత్నం చేశాడు. స్వీటీ పోషించిన సరోజ పాత్ర తెలుగు ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. ఈ సారి మాత్రం పూర్తి స్థాయి మంచి మార్కులు కొట్టేశాడు. ఓ వేశ్య తన జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందనే కథాంశాన్ని మరో స్థాయిలో చూపించేలా ప్లాన్ రెడీ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.
అన్నీ కుదిరితే ఈ వెబ్ సిరీస్ త్వరలోనే మొదలు కానుందట. దీంతోపాటు హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్ కూడా మళ్లీ మొదలుపెట్టాలనుకుంటున్నాడట క్రిష్. మొత్తానికి రాబోయే రోజుల్లో వెబ్ ప్రాజెక్టు వివరాలపై కూడా క్లారిటీ ఇవ్వనున్నాడు క్రిష్.