Konda laxman Bapuji | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 27: ఆదర్శప్రాయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కేయూ కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ అన్నారు. కేయూ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజి 110వ జయంతి ఆడిటోరియం ప్రాంగణంలోని బీసీ సెల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
అనంతరం కట్ల రాజేందర్ మాట్లాడుతూ.. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర సమరంలోనే కాకుండా నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో, మొదటితరం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఆయన జీవితం ప్రజాసేవకు అంకితమైందన్నారు. ప్రత్యేక తెలంగాణా కోసం కూడా ఆయన గళం విప్పారు, నేటితరానికి ఆయన జీవితం గొప్ప స్పూర్తిగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడు చిర్రా రాజు, సీడీసీ డీన్ ఆచార్య పీ వరలక్ష్మి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, మాజీ సంచాలకులు ఆకు తోట శ్రీనివాస్, కరుణాకర్, జె శ్రీనివాస్, తాటి దామోదర్, బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి