కోదాడ, నవంబర్ 28 : కోదాడ నూతన కోర్టు పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పద్మావతి అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. శుక్రవారం కోర్టు నూతన భవన పెండింగ్ బిల్లులు రూ.5 కోట్లు విడుదలైన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాల అధికారులు, భవన నిర్మాణ కాంట్రాక్టర్ ను బిల్డింగ్ ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని, ఏ రోజుకు ఆ రోజు పనులు, వారం వారం పనులు ఎంతవరకు జరుగుతున్నాయో రిపోర్టు ఇవ్వాలని, బిల్డింగ్ నిర్మాణ మ్యాప్ ను ప్రదర్శించాలని ఆదేశించారు. పెండింగ్ బిల్లు రూ.5 కోట్లు విడుదలైనందున పనులు వేగవంతం చేయాలన్నారు. 4 కోర్టుల బిల్డింగ్ లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తామన్నారు. కోర్టు నిర్మాణం పూర్తి అయ్యేవరకు ప్రతి బిల్లు ఆపకుండా చూస్తానని, పనులు కూడా ఏకకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే కోదాడ కోర్టులో న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు న్యాయస్థానం కావాలని, మోతె మండలాన్ని కోదాడ కోర్టు పరిధిలోకి తీసుకురావాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య,సీనియర్ న్యాయవాదులు మేకల వెంకట్రావు, నాగుబండి కృష్ణమూర్తి, ఈదుల కృష్ణయ్య, సిలివేరు వెంకటేశ్వర్లు,కె.ఎల్.ఎన్. ప్రసాద్, సహాయ కార్యదర్శి నయీమ్,కోశాధికారి కోడూరు వెంకటేశ్వర్లు,బండారు రమేష్ బాబు, వి.ధనలక్ష్మి, హుస్సేన్, నవీన్, చలం, కె.మురళి, గట్ల నర్సింహారావు, సంపేట సుధాకర్, రహీం, బెల్లంకొండ గోవర్ధన్, సీతారామరాజు, దావీదు, మిర్యాల మంగయ్య గౌడ్ పాల్గొన్నారు.