Under-19 Asia Cup : ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. జూనియర్ స్థాయిలో మెరుపు శతకాలతో అదరగొడుతున్న ఈ యంగ్‌స్టర్ అండర్ -19 ఆసియా కప్ (Under-19 Asia Cup) స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. దోహా వేదికగా డిసెంబర్ 12 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దాంతో.. గురువారం ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) కెప్టెన్‌గా 15 మందితో కూడిన పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు. విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
భారత యువ కెరటం ఆయుశ్ మాత్రే మరోసారి జూనియర్ జట్టును నడిపించనున్నాడు. ఈమధ్యే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ముంబై కుర్రాడు అండర్ -19 ఆసియా కప్ కోసం సారథిగా ఎంపికయ్యాడు. వైభవ్, విహాన్, వేదాంత్లతో టాపార్డర్ పటిష్టంగా ఉంది. ఒకవేళ ఎవరైనా గాయపడితే బ్యాకప్ కోసం నలుగురు స్టాండ్ బైలను కూడా తీసుకున్నారు సెలెక్టర్లు.
🚨 NEWS 🚨
India’s U19 Squad for ACC Men’s U19 Asia Cup announced.
The Junior Cricket Committee has picked the India U19 squad for the upcoming ACC Men’s U19 Asia Cup to take place in Dubai from 12th December.
Details 🔽 https://t.co/NQS4ihS8hn
— BCCI (@BCCI) November 28, 2025
మరో ముఖ్యమైన విషయం.. భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. దాయాదుల మ్యాచ్ డిసెంబర్ 15న స్థానిక ఐసీసీ అకాడమీలో జరుగనుంది. వచ్చే ఏడాది జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న అండర్ -19 ప్రపంచకప్ పోటీలకు ఆసియా కప్ సన్నాహక టోర్నీగా ఉపయోగపడనుంది. అందుకని రైజింగ్ ఆసియా కప్‌లో 34 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన వైభవ్ మళ్లీ దంచేసేందుకు సిద్దమవుతున్నాడు. ఆసియా కప్ పట్టేసి వరల్డ్ కప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది.
అండర్ -19 ఆసియా కప్ స్క్వాడ్ : ఆయుశ్ మాత్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా(వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుందు(వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్(వికెట్ కీపర్), యువరాజ్ గొహిల్, కనిశ్త్ చౌహన్, ఖిలాన్ పటేల్, నమన్ పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉద్దవ్ మోహన్, అరోన్ జార్జ్.
స్టాండ్ బై ప్లేయర్లు : రాహుల్ కుమార్, హెమ్చుదేశన్, బీ.కే కిశోర్, ఆదిత్యా రావత్.
గ్రూప్ ఏ – భారత్, పాకిస్థాన్, క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 3.
గ్రూప్ బీ – బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్థాన్, క్వాలిఫయర్ 2.
భారత జట్టు షెడ్యూల్ ఇదే
దోహా ఆతిథ్యమిస్తున్న అండర్ -19 ఆసియాక ప్లో ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటికే ఐదు బెర్తులు ఖరారు కాగా.. మరో మూడు క్వాలిఫయర్ ద్వారా భర్తీ అవుతాయి. టీమిండియా షెడ్యూల్ ఏంటంటే.. డిసెంబర్ 12 శుక్రవారం – క్వాలిఫయర్ 1తో – ఐసీసీ ఆకాడమీలో.. డిసెంబర్ 14 ఆదివారం – పాకిస్థాన్‌తో – ఐసీసీ ఆకాడమీలో, డిసెంబర్ 16 మంగళవారం – క్వాలిఫయర్ 3తో – ది సెవెన్స్, డిసెంబర్ 19 శుక్రవారం రోజునే మొదటి సెమీ ఫైనల్, రెండో సెమీఫైనల్ ఆడిస్తారు. డిసెంబర్ 21 ఆదివారం ఫైనల్ నిర్వహించనున్నారు.