జైపూర్: వేగంగా వెళ్తున్న స్లీపర్ బస్సు ఒక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. (Sleeper Bus Crashes) ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు సుమారు 42 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్తున్నది.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఆ స్లీపర్ బస్సు వేగంగా దూసుకెళ్లింది. అరంద్ఖేడ గ్రామం సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు.
మరోవైపు స్లీపర్ బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను కోటాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Two passengers were killed while 12 others sustained injuries after a private sleeper bus, travelling from Delhi to Indore on early Friday, hit an unidentified vehicle from behind on the Delhi-Mumbai expressway stretch in Kota district, police said.
At least 42 passengers were… pic.twitter.com/2D9d0mZa9K
— The Siasat Daily (@TheSiasatDaily) November 28, 2025
Also Read:
Watch: స్కై-డైనింగ్ రెస్టారెంట్లో చిక్కుకున్న టూరిస్టులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రాజస్థాన్‌లో గ్యాంగ్ వార్.. బైక్‌ను వాహనంతో ఢీ, కాల్పులు
Watch: ఉదయనిధి పుట్టినరోజు వేడుకలో అశ్లీల డ్యాన్సులు.. మంత్రి తీరుపై విమర్శలు