కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని కౌటల మండల కేంద్రం ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన ( Students Protest ) తెలిపారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు ( Worm rice) వస్తున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి భోజనం ప్లేట్లతో బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

పాఠశాల సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు విద్యార్థులు నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయింపు వల్ల ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి . అధికారులు సమాదానం చెప్పేంతవరకు నిరసనను విరమించుకునేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. అక్కడికి వచ్చిన విద్యాధికారులు విద్యార్థులకు సర్దిచెప్పడంతో ఆందోళనను విరమించుకున్నారు.